
Jasprit Bumrah: ప్రస్తుతం ఆసియా క్రీడల కోసం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జపాన్ పర్యటనలో ఉన్నారు. మైదానంలో తన వికెట్ల వేటలో కాకుండా, తాజాగా ఆయన చేసిన ఒక విచిత్రమైన షాపింగ్ కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. జపాన్‌లో బుమ్రా తన కోసం ఒక అత్యంత ప్రత్యేకమైన వస్తువును కొనుగోలు చేశారు. ఈ వస్తువును కొనేందుకు ఆయనతో పాటు మరో భారత ఆటగాడు అక్షర్ పటేల్ కూడా వెళ్లారు. అక్కడ బుమ్రా పడుకునే విధానం, ఆయన మెడ పొశ్చర్‌ను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో పరీక్షించిన తర్వాతే దానిని తయారు చేసి అందించడం విశేషం. ఇంతకి బుమ్రా కొనుగోలు చేసింది ఏంటో తెలుసా ? దిండు.. అవును దిండే. మనిషికి నిద్ర సరిగా ఉంటేనే ఏ పనిలోనైనా ఏకాగ్రతను చూపించడంతో పాటు, ఆరోగ్యం బాగుంటుంది. అందుకే తను సరిగ్గా సరిపోయేలా బుమ్రా దిండును డిజైన్ చేయించుకున్నాడు.
అక్షర్ పటేల్ తీసిన వీడియో వైరల్
ఈ స్పెషల్ దించును కొనుగోలు చేసే ముందు షాపులో జరిగిన పరీక్షల తంతును అక్షర్ పటేల్ తన కెమెరాలో బంధించారు. ఆ తర్వాత ఆ వీడియోను జస్ప్రీత్ బుమ్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఇంతటి ఖచ్చితమైన పరీక్షలు, కొలతల తర్వాత కొనుగోలు చేసిన ఆ దిండును చూసేందుకు సాధారణంగా ఉన్నప్పటికీ, దాని వెనుక ఉన్న టెక్నాలజీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, విశ్రాంతి కోసం వారు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఈ ఘటన నిరూపిస్తోంది.
బుమ్రా దిండు ప్రత్యేకతలు
అసలు ఈ దిండులో అంత ప్రత్యేకత ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ దిండును ప్రత్యేకంగా జస్ప్రీత్ బుమ్రా మెడ, వెన్నెముక అమరికను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. దీనిపై నిద్రించడం వల్ల ఆయనకు భవిష్యత్తులో లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా సుదీర్ఘ టూర్లలో అలసట నుంచి త్వరగా కోలుకోవడానికి, గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఈ స్పెషల్ దిండు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భార్య సంజన గణేశన్‌తో ఫన్నీ కామెంట్లు
ఈ వీడియోపై బుమ్రా సతీమణి, ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్ సరదాగా స్పందించారు. “నువ్వు జపాన్‌కు వెళ్లింది దిండ్లు కొనడానికా?” అంటూ ఆమె చేసిన కామెంట్ నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. దీనికి బుమ్రా కూడా చాలా ఫన్నీగా స్పందిస్తూ.. “నువ్వు అడిగినా సరే ఈ దిండును మాత్రం నీకు ఇవ్వను” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్యూట్ అండ్ ఫన్నీ కామెంట్ల జోడీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..