ఐపీఎల్‌లో వెర్రిపప్ప.. ఇప్పుడు సిక్సర్లతో రప్పారప్పా.. కట్ చేస్తే.. ఎవరా ప్లేయర్.?

ఈ ప్లేయర్‌కు ఐపీఎల్‌లో భారీ ధర ఇచ్చి అట్టిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. పరుగుల వరద పారిస్తాడని అనుకుంది. కానీ కాలే.! ఇప్పుడు విదేశీ లీగ్‌లో రచ్చలేపుతున్నాడు. మరి ఆ ప్లేయర్ తెల్సా.. ఎంత ధరకు కొనుగోలు చేసిందో ఆ వివరాలు ఇలా..

ఐపీఎల్‌లో వెర్రిపప్ప.. ఇప్పుడు సిక్సర్లతో రప్పారప్పా.. కట్ చేస్తే.. ఎవరా ప్లేయర్.?
Mlc 2025

Updated on: Jun 24, 2025 | 5:26 PM

సాధారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు మినీ వేలానికి వచ్చారంటే.. కచ్చితంగా తమకు వచ్చే మూడేళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇచ్చే ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంటారు. ఆ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ స్టార్ ప్లేయర్‌పై నమ్మకముంచి భారీ ధరకు రిటైన్ చేసుకుంది. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో అట్టర్ ప్లాప్ పెర్ఫార్మన్స్.. వెర్రిపప్పగా మారి ప్లేయింగ్ ఎలెవన్ నుంచి బయటకు వచ్చాడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. వేరే విదేశీ లీగ్‌లో రచ్చలేపుతున్నాడు. సిక్సర్ల సునామీ సృష్టించి.. బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే.? అతడెవరో కాదు.. జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్.

ఢిల్లీ క్యాపిటల్స్ సుమారు రూ. 9 కోట్లు ఖర్చుపెట్టి మెక్‌గుర్క్‌ను అట్టిపెట్టుకుంది. ఓపెనర్‌గా తమ జట్టుకు పరుగుల వరద పరిస్తాడని ఊహించింది. కానీ ఆ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. పేలవ ప్రదర్శన కనబరిచి జట్టు నుంచి బయటకొచ్చాడు. ఇక ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెక్‌గుర్క్.. మిడిలార్డర్‌లో పరుగులు రాబట్టుతున్నాడు. మొన్న ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ షార్ట్(91)కు సహకారం అందించిన మెక్‌గుర్క్(64) మెరుపు అర్ధసెంచరీ రాబట్టాడు. మొత్తంగా 64 పరుగులు చేసిన మెక్‌గుర్క్.. ఈ ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 7 సిక్సర్లు బాదాడు. ఒక్క ఈ మ్యాచ్‌లో మాత్రమే కాదు.. మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్.. 194.06 స్ట్రైక్‌రేటుతో 6 ఫోర్లు, 20 సిక్సర్లతో 196 పరుగులు చేశాడు. టీ20ల్లో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి