Vaibhav Suryavanshi : టీమ్ అందరికీ పార్టీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. బిల్లు చూసి బాబోయ్ అంటున్న బుడ్డోడు

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన పుట్టినరోజున జట్టుకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. పార్టీ బిల్లు చాలా ఖరీదైందని అతడు సరదాగా వ్యాఖ్యానించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Vaibhav Suryavanshi : టీమ్ అందరికీ పార్టీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. బిల్లు చూసి బాబోయ్ అంటున్న బుడ్డోడు
Vaibhav Suryavanshi

Updated on: Mar 30, 2026 | 10:51 AM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో సందడి నెలకొంది. ఆ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన పుట్టినరోజు వేడుకలను సహచర ఆటగాళ్ల మధ్య గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఐపీఎల్ అంటేనే కేవలం మైదానంలో పోటీ మాత్రమే కాదు, బయట కూడా ఆటగాళ్ల మధ్య మంచి స్నేహబంధం ఉంటుంది. ఈ క్రమంలోనే వైభవ్ తన టీమ్ మెంబర్స్ అందరికీ ఒక అదిరిపోయే బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్లు అందరూ ఈ వేడుకలో పాల్గొని వైభవ్ కు విషెస్ చెప్పారు. అయితే ఈ పార్టీ ముగిసిన తర్వాత వైభవ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా పెద్ద స్టార్ హోటళ్లలో టీమ్ మొత్తానికి పార్టీ ఇవ్వడం అంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. పార్టీ అయిపోయిన తర్వాత దీని గురించి వైభవ్ ను అడగ్గా.. అతడు చాలా నిజాయితీగా, ఫన్నీగా సమాధానమిచ్చాడు. “చాలా ఖరీదైపోయింది.. కానీ ఏం చేస్తాం, మేనేజ్ చేయాలి కదా” అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఒక సామాన్య కుర్రాడిలా వైభవ్ ఇచ్చిన ఈ ఆన్సర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్షల రూపాయల కాంట్రాక్టులు ఉన్నా, బిల్లు కట్టేటప్పుడు కలిగే ఆ చిన్న భయం, తమాషా వైభవ్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. “పెద్ద స్టార్ అయినా మన మధ్య ఉండే కుర్రాడిలాగే ఆలోచిస్తున్నాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ వంటి బిజీ షెడ్యూల్‌లో ఇలాంటి సరదా క్షణాలు ఆటగాళ్ల మధ్య ఒత్తిడిని తగ్గించి, జట్టులో ఐక్యతను పెంచుతాయి. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కూడా ఈ కుర్రాడు అందరి మనసు గెలుచుకుంటున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us