Virat Kohli: టీమిండియా ఇటీవల దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టుపై టీ20, వన్డే, టెస్ట్ ఇలా అన్ని ఫార్మాట్లలో సిరీస్ గెలుచుకొని ఓ రేంజ్‌లో ఫామ్‌లో ఉంది. ఇలాంటి సంతోషకరమైన క్షణాన్ని ఏ ప్లేయర్ అయినా కచ్చితంగా ఆస్వాదిస్తాడు. అందులోనూ జట్టు సారథికి ఆ సంతోషం మరింత ఎక్కువని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ టీమిండియా కెప్టెక్ విరాట్ కోహ్లికి మాత్రం ఈ వరుస విజయాలు సందిగ్ధంలో పడేశాయి. ఇంతకీ విరాట్‌కు ఎదురైన ఆ సందిగ్ధం ఏంటి.? నిర్ణయం తీసుకోవడానికి అంతలా ఎందుకు ఆలోచించే పరిస్థితి వస్తుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలో జరిగిన ఆస్ట్రేలియా టూర్ నుంచి రిషబ్ పంత్ అన్ని ఫార్మట్లలోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో కూడా సూపర్ ఫామ్ కొనసాగించాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో గాయమైన శ్రేయస్ అయ్యర్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో. తుది జట్టులో పంత్‌కు చోటు దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంత్ తనదైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అటు కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరడంతో తుది జట్టు ఎంపిక.. అటు టీమ్ యజమాన్యాన్ని.. ఇటు కెప్టెన్ కోహ్లీకి కత్తి మీద సాము అయ్యింది.
ఇలా ఇద్దరు ప్లేయర్స్ అద్భుత ఆటతీరు కనబరుస్తుండడంతోనే విరాట్‌కు అగ్ని పరీక్ష ఎదురవుతోందని చెప్పాలి. ఓ వైపు కేఎల్ రాహుల్ తొలి నుంచి విరాట్‌కు మంచి స్నేహితుడనే విషయం తెలిసిందే. మరోవైపు పంత్ మంచి ఆటతీరుతో రాణిస్తున్నాడు. మరి రానున్న మ్యాచ్‌ల్లో వీరిద్దరిలో ఎవరినీ జట్టులోకి తీసుకోవాలన్న దానిపై విరాట్‌లో సందిగ్ధత నెలకొంది. అయితే ఒకవేళ జట్టులో వీరిద్దరికి చోటు దక్కాలంటే ఇతర ప్లేయర్స్‌ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అలాగే సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సైతం తొలి మ్యాచ్‌లోనే చక్కటి ప్రదర్శన కనబరచడంతో వారికి కూడా అవకాశాలు ఇవ్వక తప్పదు. మరి విరాట్ ఈ సందిగ్ధం నుంచి ఎలా బయటపడతాడు.? జట్టులోకి ఎవరిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడన్నది తెలియాల్సి ఉంది.
Also Read:
Also Read: Indian Traditional Games: ఇంటర్నెట్ జనరేషన్ పిల్లలకు తెలియని మన సాంప్రదాయ భారతీయ ఆటలు ఇవే..
IPL 2021: ఐపీఎల్‌కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ దూరం.!
Covid-19: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. 30 మందికి పాజిటివ్