
Ashutosh Sharma vs Ishant Sharma: ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 19వ తేదీ శనివారం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు గుజరాత్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సమయంలో ఇషాంత్ శర్మ మైదానంలో అశుతోష్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. విషయం పెద్దదిగా మారడంతో.. ఇషాంత్ తన వేలు చూపిస్తూ అసభ్య పదజాలం ఉపయోగించాడు. దీంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ మ్యాచ్ కాస్త.. ఈ ఇద్దరు ఆటగాళ్ల వాగ్వాదంతో హీటెక్కింది. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. 19వ ఓవర్లో ఇషాంత్ శర్మ స్ట్రైక్‌లో ఉన్న అశుతోష్ శర్మకు బౌన్సర్ వేశాడు. ఈ బంతి అశుతోష్ భుజానికి నేరుగా తగిలింది. బౌలింగ్ చేస్తున్న ఇషాంత్‌కు బంతి తన బ్యాట్‌కు తగిలిందని అనిపించింది. దీనిపై వికెట్ కీపర్‌తో సహా అందరూ అప్పీల్ చేశారు. కానీ, అంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడు. గుజరాత్ దీనిపై DRS తీసుకోలేకపోయింది. ఎందుకంటే, ఆ జట్టు సమీక్షలన్నీ అయిపోయాయి. ఈ సమయంలో, ఇషాంత్ అశుతోష్ తో వాగ్వాదానికి దిగాడు. పఇషాంత్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక నేరుగా అశుతోష్ వద్దకు వెళ్లి అతని వైపు వేలు చూపిస్తూ కోపంగా ఏదో మాట్లాడటం ప్రారంభించాడు.
Battle b/w ishant sharma vs ashutosh Sharma 🤣 pic.twitter.com/EMd12Z2o7V
— Daigo18 (@daigo2637391027) April 19, 2025
వీడియోలో ఇషాంత్ శర్మ వాదిస్తున్నాడని తెలుస్తోంది. అయితే రీప్లేలో కూడా అశుతోష్ నాటౌట్ అని కనిపించింది. అయితే, ఇషాంత్ దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఈ సమయంలో, అతను తన వేలితో సైగలు కూడా చేశాడు. అతని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే, అతను 3 ఓవర్లలో 19 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. అశుతోష్ 19 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 2 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..