తలపొగరు దెబ్బకు దిగింది! రీ-ఎంట్రీలో తుస్సుమన్న పాకెట్ డైనమైట్.. కేవలం 12 బంతుల్లోనే..

తలపొగరు దెబ్బకు దిగింది! ఐపీఎల్ తప్ప టీమిండియాతో పన్లేదని అనుకున్నాడు. జట్టుకు గత కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. కట్ చేస్తే.. డీవై పటేల్ టోర్నమెంట్‌తో డొమెస్టిక్ క్రికెట్‌లో బరిలోకి దిగితే.. రీ-ఎంట్రీ మ్యాచ్‌లోనే తుస్సుమన్నాడు ఈ పాకెట్ డైనమైట్.. కేవలం 12 బంతుల్లోనే.. ఒక్క సిక్స్‌తో..

తలపొగరు దెబ్బకు దిగింది! రీ-ఎంట్రీలో తుస్సుమన్న పాకెట్ డైనమైట్.. కేవలం 12 బంతుల్లోనే..
Ishan Kishan

Updated on: Feb 28, 2024 | 9:09 AM

టీమిండియా వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీలో తుస్సుమనిపించాడు. డీవై పాటిల్ క్రికెట్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్.. 12 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. పెవిలియన్ చేరాడు. గత కొన్నిరోజులుగా ఇషాన్ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తూ వస్తున్నాడు. సఫారీ పర్యటన మధ్యలోనే డిప్రెషన్ కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేసిన ఇషాన్.. ఆ తర్వాత కోచ్ ద్రావిడ్ మాటలు పెడచెవిని పెడుతున్నాడని, బీసీసీఐ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. దీంతో బోర్డు అతడిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో.. ఇలా డీవై పాటిల్ క్రికెట్ టోర్నమెంట్‌తో బరిలోకి దిగాడు ఇషాన్ కిషన్.

ఈ టోర్నీలో ఇషాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం రూట్ మొబైల్ టీంతో జరిగిన మ్యాచ్‌లో ఆర్బీఐ 89 పరుగులతో ఓటమిపాలైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యచేదనతో బరిలోకి దిగిన ఇషాన్ టీం 16.3 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ వికెట్ కీపింగ్ చేసి.. ఒక స్టంపింగ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే బ్యాట్‌తో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు.

కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న కిషన్.. ఒక సిక్స్, రెండు ఫోర్లతో 19 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఇషాన్ కిషన్.. ఐపీఎల్ కోసం ఇటీవల బరోడాలో హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే పునరాగమనం తర్వాత తొలి మ్యాచ్‌లోనే తుస్సుమన్నాడు ఇషాన్ కిషన్. కాగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున బరిలోకి దిగనున్నాడు ఇషాన్ కిషన్.. ఇక ఈ సీజన్‌లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు హార్దిక్ పాండ్యా.

ఇది చదవండి: ఒక్క టీ20, వన్డే ఆడని దిగ్గజ బౌలర్.. కట్ చేస్తే.. 12 ఏళ్ల కెరీర్‌‌ ఖేల్ ఖతం!