
Chief Selector : భారత క్రికెట్ జట్టుకు కొత్త చీఫ్ సెలెక్టర్ రాబోతున్నాడా? రవిశాస్త్రి త్వరలో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమితులు కాబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రవిశాస్త్రి త్వరలో అజిత్ అగార్కర్ స్థానాన్ని భర్తీ చేయవచ్చని అంటున్నారు. అగార్కర్ జూలై 2023 నుండి భారత జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే రవిశాస్త్రి నిజంగానే 4 సంవత్సరాల తర్వాత టీమిండియాలోకి తిరిగి వస్తున్నారా? ఈ వైరల్ దావాలలో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో అజిత్ అగార్కర్ స్థానంలో రవిశాస్త్రి టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వైరల్ పోస్ట్‌ను పరిశీలించగా ఈ వార్త పూర్తిగా ఫేక్ న్యూస్ తేలింది. సాధారణంగా ఇంత పెద్ద పదవికి నియామకం కోసం బీసీసీఐ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. కానీ చీఫ్ సెలెక్టర్ పదవికి నియామకం సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఈ వార్తలపై రవిశాస్త్రి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అలాగే, అజిత్ అగార్కర్ నుండి కూడా ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు రాలేదు. రవిశాస్త్రి గతంలో టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశారు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత కోచ్ పదవి నుండి తప్పుకున్నారు. అయితే, ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత అతను టీమిండియాలోకి చీఫ్ సెలెక్టర్ పదవిలో తిరిగి వస్తున్నారనే పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి. ప్రస్తుతం అజిత్ అగార్కర్ తన పదవిలో కొనసాగుతున్నారు.
అజిత్ అగార్కర్‌ను 2023 వన్డే ప్రపంచ కప్‌కు కొన్ని నెలల ముందు, జూలైలో టీమిండియాకు చీఫ్ సెలెక్టర్‌గా నియమించారు. చీఫ్ సెలెక్టర్‌గా ఉండటం చాలా కష్టమైన పని అని అతను ఇటీవల చెప్పాడు. భారతదేశంలో ఇంత టాలెంట్ నిండి ఉందని, అందులో నుండి ఆటగాళ్లను సెలక్ట్ చేయడం చాలా కష్టమని అగార్కర్ పేర్కొన్నాడు. అతని పదవీకాలం జూన్ 2026 వరకు పొడిగించారు. కాబట్టి, ప్రస్తుతానికి అజిత్ అగార్కర్ తన పదవిలో కొనసాగుతారని స్పష్టమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..