IPL 2023: ఇన్ని కోట్లా.? విరాట్ కోహ్లీ టీం శాలరీలకు ఇంత ఖర్చు.. కానీ టైటిళ్లు మాత్రం జీరో..

|

Nov 21, 2022 | 6:58 AM

క్రికెట్ చరిత్రలోనే క్యాష్ రిచ్ లీగ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఐపీఎల్. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన ఎంతోమంది యువ ఆటగాళ్లను లక్షాధికారులను చేసిందీ లీగ్.

IPL 2023: ఇన్ని కోట్లా.? విరాట్ కోహ్లీ టీం శాలరీలకు ఇంత ఖర్చు.. కానీ టైటిళ్లు మాత్రం జీరో..
Royal Challengers Bangalore
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ చరిత్రలోనే క్యాష్ రిచ్ లీగ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఐపీఎల్. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన ఎంతోమంది యువ ఆటగాళ్లను లక్షాధికారులను చేసిందీ లీగ్. ఈ లీగ్‌లోని వేలంలో అమ్ముడుపోవాలంటే.. టాలెంట్, అదృష్టం రెండూ ఉండాలి. ఒక్కసారి ఫ్రాంచైజీలను ఆకర్షితే.. కాసులు కురిసినట్లే.. ఇక తుది జట్టులోకి అవకాశం దక్కి.. ప్రతీ మ్యాచ్ రాణిస్తే.. ఆ నెక్స్ట్ వచ్చే వేలంలో కోట్లు సొంతం అవుతాయి. అటు ఫ్రాంచైజీలకు మంచి ఆటగాళ్లతో కూడిన తుది జట్లు దొరికితే.. ట్రోఫీలను చేజిక్కించుకున్నట్లే. మరి అంత గొప్ప ప్లేయర్స్ ఉండి.. శాలరీలకు ఇప్పటిదాకా ఎక్కువ కోట్లు వెచ్చించిన ఫ్రాంచైజీ ఏంటో మీకు తెలుసా.? చిన్న క్లూ దానికి మొన్నటి వరకు విరాట్ కోహ్లీనే కెప్టెన్.

ఇంకేముంది ఆ ఫ్రాంచైజీ మరేదో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటిదాకా 15 సీజన్లు జరగ్గా.. ఒక్క ట్రోఫీ కూడా ఆర్సీబీ సొంతం చేసుకోలేదు. అయితే ఆటగాళ్ల శాలరీ కింద ఈ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 910 కోట్లు ఖర్చు పెట్టిందట. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉందని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. అత్యధిక మొత్తంలో ఆటగాళ్లకు శాలరీలు చెల్లిస్తున్నా.. ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీ గెలవలేదంటూ ఆర్సీబీను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షల్ గిబ్స్‌ ట్రోల్ చేశాడు. కాగా, దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. సఫారీలు మాదిరిగానే ఆర్సీబీ కూడా చోకర్స్ అనిపించుకుంటోందని కొందరు గిబ్స్‌కు కౌంటర్ ఇస్తుంటే.. మరికొందరు ఐపీఎల్‌లో గిబ్స్ ఆటను గుర్తు చేసుకుంటూ తమ అభిమానాన్ని తెలిపారు.

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఖర్చుపెట్టిన మొత్తం గెలిచిన టైటిళ్లు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 910.5 కోట్లు 0
ముంబై ఇండియన్స్‌ రూ. 884.5 కోట్లు 5
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 852.5 కోట్లు 2
ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 826.6 కోట్లు 0
పంజాబ్‌ కింగ్స్‌ రూ. 778.3 కోట్లు 0
చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 761.1 కోట్లు 4
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 646.9 కోట్లు 1
రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 613.3 కోట్లు 1
లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 89.2 కోట్లు 0
గుజరాత్ టైటాన్స్ రూ. 88.3 కోట్లు 1

ఐపీఎల్ 2023కి ఫ్రాంచైజీలు సిద్దం..

మరోవైపు ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వేలంలో మంచి ఫామ్ ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా నవంబర్ 15 నాటికి పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది.