
Kavya Maran Change Team Name: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ తన జట్టు పేరును మార్చారు. అయితే, ఆమె మార్చిన జట్టు ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ కాదండోయ్. ది హండ్రెడ్ లీగ్‌లోని నార్తర్న్ సూపర్‌చార్జర్స్. కావ్య మారన్ ఇప్పుడు ది హండ్రెడ్‌లో ఆడుతున్న తన జట్టు పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా మార్చారు. 2026లో ప్రారంభమయ్యే ది హండ్రెడ్ సీజన్‌కు ముందు నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పేరును మార్చడం గురించి ఇప్పటికే నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే.
చెన్నైకి చెందిన సన్ గ్రూప్, ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 1,155 కోట్లకు నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు చేసింది. యార్క్‌షైర్ సూపర్‌చార్జర్స్‌లో తన 51% వాటాను విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈసీబీ 49% వాటాతో పాటు, సన్ గ్రూప్ ఇప్పుడు కంపెనీలో 100% వాటాను కలిగి ఉంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అనేది లీడ్స్‌కు చెందిన ఫ్రాంచైజీ, అందుకే దాని కొత్త పేరులో లీడ్స్‌తో పాటు కావ్య మారన్ ట్రేడ్‌మార్క్ సన్‌రైజర్స్ కూడా ఉన్నాయి.
కావ్య మారన్ సన్ గ్రూప్ లీడ్స్‌లోని కంపెనీస్ హౌస్‌లో కొత్త పేరుకు సంబంధించి పత్రాలను దాఖలు చేసింది. దీని అర్థం సూపర్‌చార్జర్స్ పేరు ప్రస్తుతానికి నిలిపివేసింది. కావ్య మారన్ జట్టు IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్, SA20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని పేరు పెట్టినట్లే, ఈ జట్టుకు సన్‌రైజర్స్ లీడ్స్ అని పేరు పెట్టింది.
ది హండ్రెడ్‌లో ఆడుతున్న ఎనిమిది జట్లలో.. పేర్లు మార్చిన వాటిలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మూడవది. అదేవిధంగా, మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మార్చారు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ పేరు ముంబై ఇండియన్స్ లండన్‌గా మార్చనున్నారు.