IPL 2022 Retention Rules: నలుగురిని మాత్రమే తిరిగి తీసుకొవచ్చు.. కొత్త జట్లు ముగ్గురిని మాత్రమే తీసుకోవాలి..

|

Oct 28, 2021 | 6:19 PM

ప్రస్తుతమున్న ఎనిమిది IPL జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను తిరిగి తీసుకునే అవకాశం ఉంది. అయితే రెండు కొత్త ఫ్రాంచైజీలు 2022 వేలానికి ముందు మిగిలిన ప్లేయర్ పూల్ నుండి ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది...

IPL 2022 Retention Rules: నలుగురిని మాత్రమే తిరిగి తీసుకొవచ్చు.. కొత్త జట్లు ముగ్గురిని మాత్రమే తీసుకోవాలి..
Ipl
Follow us on

ఐపీఎల్‎లో జట్లలో తిరిగి తీసుకునే ఆటగాళ్లపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతమున్న ఎనిమిది IPL జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను తిరిగి తీసుకునే అవకాశం ఉంది. అయితే రెండు కొత్త ఫ్రాంచైజీలు 2022 వేలానికి ముందు మిగిలిన ప్లేయర్ పూల్ నుండి ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వేలం కోసం తేదీ ఖరారు కానప్పటికీ 2022 వేలం కోసం ఒక్కో ప్రాంచేజీ 90 కోట్లు (సుమారు USD 12 మిలియన్లు) కోసం ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 2021 వేలంలో అందుబాటులో ఉన్న 85 కోట్ల కంటే కాస్త ఎక్కువ. ఆటగాళ్లను తిరికి తీసుకుంటే అందులో ముగ్గురు భారతీయులు, ఒకరు విదేశీయుడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రెండు కొత్త ఫ్రాంచైజీలకు వెళ్లే ముగ్గురు ఆటగాళ్ల విషయానికొస్తే లక్నో, అహ్మదాబాద్ – IPL జట్లు ఇద్దరు భారతీయ ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడిని తీసుకొవచ్చు. నిలుపుదలకి సంబంధించి, తుది ఎంపిక ఆటగాడి వద్దే ఉంటుంది. అతను ఉండాలనుకుంటున్నారా లేదా వేలం పూల్‌లోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నారా ఆటగాడి ఇష్టం. 2018లో వేలం జరిగినప్పుడు జట్లకు INR 80 కోట్ల వరకు అవకాశం కల్పించారు. రిటైన్ చేయబడిన ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా INR 33 కోట్లు ఖర్చు చేయవచ్చు.

వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ గరిష్ఠంగా ముగ్గురు ఆటగాళ్లను కలిగి ఉన్నట్లయితే మొదటి ఆటగాడికి INR 15 కోట్లు, రెండో ఆటగాడికి INR 11 కోట్లు, మూడో వ్యక్తికి INR 7 కోట్లు ఉండే అవకాశం ఉంటుంది.
ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసినట్లయితే, మొదటి ఆటగాడు 12.5 కోట్ల రూపాయలకు, రెండో ఆటగాడు INR 8.5 కోట్లకు కొనుగోలు చేయవచ్చు. ఒక ఆటగాడిని మాత్రమే ఉంచుకుంటే ఫ్రాంచైజీ వారి పర్స్ నుండి INR 12.5 కోట్లను కోల్పోతుంది.

Read Also.. Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..