IPL 2022 Points Table: ఆర్‌సీబీపై విజయంతో నంబర్ 1గా రాజస్థాన్.. గుజరాత్, హైదరాబాద్‌ స్థానాలో మార్పులు..

|

Apr 27, 2022 | 6:12 AM

బెంగళూరు ఓటమి, రాజస్థాన్ విజయంతో పాయింట్ల పట్టిక(Points Table)లో బలమైన ప్రభావం చూపాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

IPL 2022 Points Table: ఆర్‌సీబీపై విజయంతో నంబర్ 1గా రాజస్థాన్.. గుజరాత్, హైదరాబాద్‌ స్థానాలో మార్పులు..
Ipl Points Table
Follow us on

బెంగళూరు ఓటమి, రాజస్థాన్ విజయంతో పాయింట్ల పట్టిక(Points Table)లో బలమైన ప్రభావం చూపాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అదే సమయంలో రాజస్థాన్ విజయంతో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాల్లో కూడా తేడాను తెచ్చిపెట్టింది. ఏప్రిల్ 26న పూణెలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 29 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. ఈ విజయం తర్వాత మూడో స్థానం నుంచి నేరుగా పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌కి చేరుకుంది. అదే సమయంలో, ఓడిపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ (RCB) తన పాత స్థానమైన 5 వ స్థానాన్ని నిలబెట్టుకుంది.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన తర్వాత కూడా ప్లేస్‌లో ఎలాంటి మార్పు లేదు. అంటే లక్నో 4వ స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ నంబర్ వన్ నుంచి రెండో స్థానానికి దిగజారగా, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒక స్థానం దిగజారి రెండో ర్యాంక్ నుంచి మూడో స్థానానికి చేరుకుంది.

రన్ రేట్‌లో అదరగొట్టిన రాజస్థాన్‌..

ఐపీఎల్ 2022లో 8వ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఆరో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ కూడా ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. అంటే రెండు జట్లకు సమాన పాయింట్లు ఉన్నాయి. కానీ, రన్ రేట్ ఆధారంగా రాజస్థాన్ ముందుంది. అదే సమయంలో, ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ విధంగా ఆర్‌సీబీ ఐదు విజయాలలో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

RCB 9 మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమి..

బెంగళూరు 9 మ్యాచ్‌లు ఆడిన తర్వాత సాధించిన పాయింట్ల సంఖ్య.. లక్నో 8 మ్యాచ్‌ల్లోనే సాధించింది. RCB కంటే ఒక మెట్టు పైకి రావడానికి ఇదే కారణంగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం బెంగళూరు, లక్నో కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి సమాన పాయింట్లు సాధించింది. హైదరాబాద్ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనుభవం ఉన్న రెండు జట్లు – ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ – ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. CSK కేవలం 2 మ్యాచ్‌లు గెలిచి 9వ స్థానంలో ఉంది. కాగా 10 జట్ల పోరులో ముంబై ఖాతా తెరవలేదు. ముంబైకి 5 సార్లు, చెన్నైకి 4 సార్లు ఐపీఎల్ గెలిచిన అనుభవం ఉన్నప్పటి పరిస్థితి ఈసారి మాత్రం చాలా కఠినంగా మారింది.

జట్టు ఆడిన మ్యాచ్‌లు విజయాలు ఓటమి పాయింట్లు నికర రన్ రేట్
రాజస్థాన్ రాయల్స్ 8 6 2 12 +0.561
గుజరాత్ టైటాన్స్ 7 6 2 12 +0.396
సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 5 2 10 +0.691
లక్నో సూపర్ జెయింట్స్ 8 5 3 10 +0.334
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 5 4 10 -0.572
పంజాబ్ కింగ్స్ 8 4 4 8 -0.419
ఢిల్లీ క్యాపిటల్స్ 7 3 4 6 +0.715
కోల్‌కతా నైట్ రైడర్స్ 8 3 5 6 +0.080
చెన్నై సూపర్ కింగ్స్ 8 2 6 4 -0.538
ముంబై ఇండియన్స్ 8 0 8 0 -1.000

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: RR vs RCB IPL 2022 Match Result: కుల్దీప్, అశ్విన్‌ల దెబ్బకు ఆర్‌సీబీ ఢమాల్.. ఆరో విజయంతో అగ్రస్థానం చేసిన రాజస్థాన్..

IPL 2022: ముంబై, సీఎస్‌కే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయా.? ఇవిగో లెక్కలు.!