DC vs GT: పంత్ సాక్షిగా ఢిల్లీలో బ్యాండ్ బాజా బరాత్.. విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైన ఐదుగురు.. ఎవరంటే?

|

Apr 04, 2023 | 4:42 PM

Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2023 ఏడవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో డేవిడ్ వార్నర్‌తోపాటు, హార్దిక్ పాండ్యా బ్యాండ్ బజాయించేందుకు సిద్ధమయ్యారు.

1 / 6
ఐపీఎల్ 2023 ఏడవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో డేవిడ్ వార్నర్ తన బ్యాట్‌తో బ్యాండ్ బజాయించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో అందరి చూపు మాత్రం హార్దిక్ పాండ్యా ప్రదర్శనపైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడేళ్ల తర్వాత తమ సొంత ప్రేక్షకుల ముందు ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో హోరాహోరి ప్రదర్శన ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇరుజట్లలో కొందరు కీలక ఆటగాళ్లపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి లిస్టులో ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
డేవిడ్ వార్నర్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ ఒంటిచేత్తో జట్టు తరపున పోరాడి అర్ధ సెంచరీతో అద్భుత  ఇన్నింగ్స్ ఆడాడు. అరుణ్ జైట్లీ మైదానంలోనూ వార్నర్‌ మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధమయ్యాడు. మైదానంలో ఉన్న చిన్న బౌండరీని బట్టి చూస్తే, వార్నర్ ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి ట్రంప్ కార్డ్ అని నిరూపించవచ్చు.

3 / 6
మిచెల్ మార్ష్: అంతర్జాతీయ క్రికెట్‌లో తన బ్యాట్‌తో దూసుకుపోతున్న మిచెల్ మార్ష్.. ఢిల్లీలోని చిన్న మైదానంలో విధ్వంసం సృష్టించగలడు. తొలి మ్యాచ్‌లో మార్ష్ ఖాతా తెరవలేకపోయినా.. అతని ఇటీవలి ఫామ్‌ను చూస్తుంటే.. గుజరాత్‌కు అతడు పెనుముప్పు అని నిరూపించుకోవచ్చు.

4 / 6
శుభమాన్ గిల్: గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. గిల్ పవర్‌ప్లే లోపల వేగంగా పరుగులు చేయగలడు. CSKపై గిల్ 36 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

5 / 6
హార్దిక్ పాండ్యా: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి పెను ముప్పు పొంచి ఉంది. హార్దిక్ బ్యాట్‌తో బాదడం నుంచి.. బౌలింగ్‌లో వికెట్లు తీయడం కూడా తెలుసు. అంటే హార్దిక్ ద్విముఖ దాడితో ఢిల్లీకి తీవ్ర నష్టం కలిగించే ఛాన్స్ ఉంది.

6 / 6
రషీద్ ఖాన్: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ అతిపెద్ద ట్రంప్ కార్డ్ అని నిరూపించగలడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండు వికెట్లు పడగొట్టిన రషీద్ బ్యాట్‌తో కూడా కీలక సహకారాన్ని అందించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని చిన్న మైదానంలో రషీద్ చివరి ఓవర్లలో పరుగులకు చెక్ పెడుతూ విధ్వంసం సృష్టించగలడు.