IPL 2026: ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరే తోపుగాళ్లు.. బరిలోకి దిగితే కాసులు కురవాల్సిందే.!

చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధిక పర్స్ వాల్యూతో మినీ వేలంలోకి వస్తుండటంతో.. దాదాపుగా పెద్ద ఆటగాళ్లను వీరు లాక్కునేలా కనిపిస్తున్నారు. అటు ఇద్దరికీ ఆల్‌రౌండర్ అవసరం ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, అలాగే సఫారీ ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్‌పై..

IPL 2026: ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరే తోపుగాళ్లు.. బరిలోకి దిగితే కాసులు కురవాల్సిందే.!
Ipl 2026

Updated on: Dec 09, 2025 | 1:52 PM

సమయం ఆసన్నమైంది.! మరో వారం రోజుల్లో ఐపీఎల్ మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ లిస్టులను విడుదల చేసేశాయి. ముందుగా 1355 ప్లేయర్స్ మినీ ఆక్షన్‌కు తమ పేర్లను నమోదు చేయగా.. చివరికి 350 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్టు చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ప్రధాన ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, రస్సెల్ ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో.. ఓ ఇద్దరు ఆటగాళ్లపై భారీగా కాసుల వర్షం కురిసేలా కనిపిస్తోంది. అలాగే సెట్ వైజ్ ప్లేయర్స్‌ లిస్టు సైతం రిలీజ్ చేశారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరెవరో తెలుసా.?

Set -1:(ఓపెనింగ్ బ్యాటర్స్)

డివాన్ కాన్వే, జెక్ ఫ్రాసేర్ మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా

Set – 2:(బ్యాటింగ్ ఆల్‌రౌండర్స్)

గస్ అట్కిన్సన్, వానిందు హసరంగా, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, లియాం లివింగ్‌స్టన్, వియమ్ ముల్దర్, రచిన్ రవీంద్ర

Set – 3:(వికెట్ కీపర్స్)

ఫిన్ అలెన్, బెయిర్‌స్టో, కేఎస్ భరత్, క్వింటన్ డికాక్, డకేట్, గుర్బాజ్, జమీ స్మిత్

Set – 4:(ఫాస్ట్ బౌలర్లు)

కెత్జీ, ఆకాష్ దీప్, డఫ్ఫీ, ఫారూఖీ, మాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్, శివమ్ మావి, నోకియా, పతిరానా

Set – 5:(స్పిన్నర్స్)

రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, అకేల్ హోసేన్, ముజీబ్ రెహ్మాన్, తీక్షనా

Set – 6:(బౌలింగ్ ఆల్‌రౌండర్లు)

ఆర్య దేశాయ్, దుల్, అభినవ్ మనోహర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అథర్వ, అభినవ్ తేజ్రానా

అటు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధిక పర్స్ వాల్యూతో మినీ వేలంలోకి వస్తుండటంతో.. దాదాపుగా పెద్ద ఆటగాళ్లను వీరు లాక్కునేలా కనిపిస్తున్నారు. అటు ఇద్దరికీ ఆల్‌రౌండర్ అవసరం ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, అలాగే సఫారీ ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్‌పై కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అటు కామెరాన్ గ్రీన్ ఆక్షన్‌లో బిగ్ ప్రైజ్‌కు అమ్ముడయ్యే అవకాశం ఉందని టాక్.