Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ముంబై షాక్.. అర్జున్ ప్లేస్‌లో ఆ ప్లేయర్.. బిగ్ డీల్‌కు అంతా సిద్ధం..

ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ట్రేడ్ విండో వేడెక్కింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య అర్జున్ టెండూల్కర్, శార్దూల్ ఠాకూర్ బదిలీకి సంబంధించి క్యాష్ డీల్ చర్చలు జరుగుతున్నాయి. లక్నోలో అర్జున్‌కు నిరూపించుకునే గొప్ప అవకాశం లభించవచ్చని అంచనాలు ఉన్నాయి. అర్జున్‌ని లక్నో తీసుకుంటుందా.? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ముంబై షాక్.. అర్జున్ ప్లేస్‌లో ఆ ప్లేయర్.. బిగ్ డీల్‌కు అంతా సిద్ధం..
Arjun Tendulkar Likely To Join Lsg

Updated on: Nov 13, 2025 | 8:10 AM

ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ట్రేడ్ విండో ఆసక్తి రేపుతోంది. టాప్ ఆటగాళ్లు జట్లు మారే అవకాశం ఉండగా, రెండు ప్రధాన ఫ్రాంచైజీల మధ్య క్యాష్ డీల్ చర్చలు నడుస్తున్నాయి. ఈ ఒప్పందంలో ముంబై ఇండియన్స్ యువ ఆల్ రౌండర్ అర్జున్ టెండూల్కర్, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ పాల్గొనే అవకాశం ఉంది.

ముంబైకి శార్దూల్.. లక్నోకి అర్జున్

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ తమ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌కు పంపించే యోచిస్తోంది. అదే సమయంలో, ముంబై ఇండియన్స్ యంగ్ ఆల్ రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను లక్నోకు పంపే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందం ఆటగాళ్లను నేరుగా మార్పిడి చేసుకునే పద్ధతిలో జరగకుండా.. రెండు ఫ్రాంచైజీల మధ్య ప్రత్యేకమైన క్యాష్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఒక జట్టు మరొక జట్టు నుంచి ఆటగాడిని తీసుకుని, అందుకు బదులుగా డబ్బును చెల్లిస్తుంది.

నగదు ఒప్పందం ఎలా?

ఐపీఎల్ ట్రేడ్ విండోలో నగదు ఒప్పందాలు జరగడానికి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి:

అసలు కొనుగోలు ధర: ఒక ఫ్రాంచైజీ, ఆటగాడిని అతనిని వేలంలో కొనుగోలు చేసిన అసలు ధరకు సమానమైన రుసుముతో పొందవచ్చు. ఉదాహరణకు, అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ధర ఆధారంగా ఒప్పందం జరగవచ్చు.

రహస్య ఒప్పందం: ఈ పద్ధతిలో రెండు జట్లు తమ మధ్య ఒక స్థిర మొత్తానికి డీల్ సెట్ చేసుకోవచ్చు. ఎంత చెల్లించారనేది చెప్పకుండా ఒప్పందాన్ని సీక్రెట్‌గా ఉంచుతాయి. ఈ సందర్భంలో జట్లు ఆటగాడిని వారి మునుపటి జీతం కంటే ఎక్కువ ఖర్చు చేసి కూడా తీసుకోవచ్చు.

అర్జున్‌కు గొప్ప అవకాశం

గత కొన్ని సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ అర్జున్ టెండూల్కర్‌కు అనుకున్న స్థాయిలో ఆడే అవకాశాలు లభించలేదు. అతను 2023లో నాలుగు మ్యాచ్‌లు ఆడినా, 2024 సీజన్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అతను ఐదు మ్యాచ్‌లు ఆడి, మూడు వికెట్లు తీశాడు. బ్యాట్స్‌మన్‌గా 13 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్ వంటి స్టార్-ఆధారిత జట్టులో బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌కు, లక్నో సూపర్ జెయింట్స్ వంటి కొత్త జట్టులోకి మారడం ఆటగాడిగా నిరూపించుకోవడానికి, నిలకడగా ఆడేందుకు అవకాశం ఉంటుంది.

CSK-RR ట్రేడ్ కూడా చర్చల్లో..

అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరో భారీ ట్రేడ్ డీల్ కూడా వార్తల్లో ఉంది. ఈ ఒప్పందంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ వంటి కీలక ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడ్ విండోలో మరిన్ని సంచలన మార్పులు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..