IPL 2026 : అంతా కలిసి 70 మందిని రోడ్డు మీద పడేశారు.. మినీ వేలంలో ఫ్రాంచైజీల ప్లాన్ ఏంటి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం అంతా సిద్ధమైంది. వేలం డిసెంబర్ 16న జరగనున్న నేపథ్యంలో 10 జట్లు తమ రిటెన్షన్ లిస్ట్‌లను విడుదల చేశాయి. అయితే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కంటే కూడా విడుదలైన ఆటగాళ్లే ఎక్కువ చర్చనీయాంశమయ్యారు.

IPL 2026 : అంతా కలిసి 70 మందిని రోడ్డు మీద పడేశారు.. మినీ వేలంలో ఫ్రాంచైజీల ప్లాన్ ఏంటి?
Ipl 2026 Captains

Updated on: Nov 17, 2025 | 5:00 PM

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం అంతా సిద్ధమైంది. వేలం డిసెంబర్ 16న జరగనున్న నేపథ్యంలో 10 జట్లు తమ రిటెన్షన్ లిస్ట్‌లను విడుదల చేశాయి. అయితే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కంటే కూడా విడుదలైన ఆటగాళ్లే ఎక్కువ చర్చనీయాంశమయ్యారు. అన్ని జట్లు కలిసి మొత్తం 70 మంది ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. ఈ లిస్ట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆండ్రీ రస్సెల్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్‌ల పేర్లు ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

టీమ్ వారీగా విడుదలైన ఆటగాళ్ల వివరాలు

అన్ని జట్లలో అత్యధికంగా ఆటగాళ్లను విడుదల చేసిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK).

చెన్నై సూపర్ కింగ్స్ (10 మంది): రాహుల్ త్రిపాఠి, వంశ్‌ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి మరియు మతీశ పతిరానా. (చెన్నై జట్టు తమ కీలక విదేశీ ఆటగాళ్లు కాన్వే, పతిరానాలకు గుడ్‌బై చెప్పడం పెద్ద షాక్)

కోల్‌కతా నైట్ రైడర్స్ (9 మంది): ఆండ్రీ రస్సెల్, రహమానుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డి కాక్, మొయిన్ అలీ, ఎన్రిచ్ నోర్ట్జే, లవ్‌నీత్ సిసోడియా, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్. (రస్సెల్, అయ్యర్ వంటి వారిని వదులుకోవడం కేకేఆర్‌ ప్లాన్‌లో భాగమేనని తెలుస్తోంది.)

ముంబై ఇండియన్స్ (8 మంది): సత్యనారాయణ రాజు, రీస్ టోప్లీ, కేఎల్ శ్రీజిత్, కర్ణ్ శర్మ, బెవన్ జాకబ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, లిజాద్ విలియమ్స్, విగ్నేష్ పుత్తూర్.

రాజస్థాన్ రాయల్స్ (7 మంది): వానిందు హసరంగా, ఫజల్‌హక్ ఫారూఖీ, ఆకాష్ మధ్వాల్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ సింగ్, అశోక్ శర్మ, కునాల్ రాథోడ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 మంది): ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్దర్, అభినవ్ మనోహర్, అథర్వ తవ్డే, సిమర్‌జీత్ సింగ్, సచిన్ బేబీ.

లక్నో సూపర్ జెయింట్స్ (7 మంది): ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్‌గేకర్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్. (డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్ వంటి స్టార్లు వేలంలోకి రావడం ఆసక్తికరం.)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (6 మంది): స్వాస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, లుంగీ ఎన్గిడి, మోహిత్ రాఠీ.

ఢిల్లీ క్యాపిటల్స్ (6 మంది): ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, సెదికుల్లా అటల్, మన్వంత్ కుమార్, మోహిత్ శర్మ. (సీనియర్ ఆటగాడు, ఫాఫ్ డు ప్లెసిస్‌ను వదులుకోవడంతో ఢిల్లీ కెప్టెన్సీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.)

పంజాబ్ కింగ్స్ (5 మంది): గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, కులదీప్ సేన్, ప్రవీణ్ దూబే.

గుజరాత్ టైటాన్స్ (5 మంది): మహిపాల్ లోమ్రోర్, కరీమ్ జనత్, దసున్ షనక, గెరాల్డ్ కోయెట్జీ, కుల్వంత్ ఖేజ్రోలియా.

వేలంలో కీలక ఆటగాళ్లు:

రిలీజ్ అయిన ఈ 70 మంది ఆటగాళ్లు డిసెంబర్ 16న జరిగే మినీ వేలంలో మళ్లీ వేరే జట్ల పర్స్‌లను ఖాళీ చేయడం ఖాయం. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్, డెవాన్ కాన్వే, మతీశ పతిరానా వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు మళ్లీ వేలంలోకి రావడం వల్ల ఈసారి మినీ ఆక్షన్ మరింత ఉత్కంఠగా మారనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..