IPL 2025 Points Table: ఢిల్లీకి షాకిచ్చిన గుజరాత్.. రాజస్థాన్ ఓటమితో పాయింట్ల పట్టికలో కీలక మార్పు

Indian Premier League 2025 Points Table Update After GT vs RR Match: మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ తర్వాత, సంజు శాంసన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ విజయాల జోరును అడ్డుకోలేకపోయింది.

IPL 2025 Points Table: ఢిల్లీకి షాకిచ్చిన గుజరాత్.. రాజస్థాన్ ఓటమితో పాయింట్ల పట్టికలో కీలక మార్పు
Ipl 2025 New Captains

Updated on: Apr 10, 2025 | 6:35 AM

Indian Premier League 2025 Points Table Update After GT vs RR Match: ఐపీఎల్ 2025 సీజన్‌లో 23వ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. రాజస్థాన్‌ను ఓడించిన గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అగ్రస్థానం నుంచి తప్పించింది. వరుసగా నాలుగు విజయాలతో, గుజరాత్ ఖాతాలో గరిష్టంగా ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. కాగా, రాజస్థాన్ రాయల్స్ ఐదవ మ్యాచ్‌లో మూడో ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడో స్థానంలో కొనసాగుతోంది.

గుజరాత్ ఖాతాలో ‘నాలుగు’ విజయాలు..

గుజరాత్ గురించి మాట్లాడుకుంటే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ తర్వాత, సంజు శాంసన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ విజయాల జోరును అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో, గుజరాత్ జట్టు ప్లేఆఫ్ వైపు బలమైన అడుగులు వేసింది.

IPL 2025 పాయింట్ల పట్టిక

జట్టు ఆడిన మ్యాచ్‌లు విజయం ఓటమి నెట్ రన్ రేట్ పాయింట్లు
1. గుజరాత్ టైటాన్స్ 5 4 1 1.413 8
2. ఢిల్లీ క్యాపిటల్స్ 3 3 0 1.257 6
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 3 1 1.015 6
4. పంజాబ్ కింగ్స్ 4 3 1 0.289  6
5. లక్నో సూపర్ జెయింట్స్ 5 3 2 0.078  6
6. కోల్‌కతా నైట్ రైడర్స్ 5 2 3 -0.056  4
7. రాజస్థాన్ రాయల్స్ 5 2 3 -0.733  4
8. ముంబై ఇండియన్స్ 5 1 4 -0.010  2
9. చెన్నై సూపర్ కింగ్స్ 5 1 4 -0.889  2
10. సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 1 4 -1.629  2

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..