RR vs LSG, ఐపీఎల్ 2024: శాంసన్ వర్సెస్ రాహుల్ పోరుకు రెడీ.. అందరి చూపు ఆ ఖతర్నాక్ ప్లేయర్‌పైనే..

|

Mar 24, 2024 | 7:04 AM

Rajasthan Royals vs Lucknow Super Giants Match Preview: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మైదానంలో సగటు స్కోరు దాదాపు 160గా ఉంది. పిచ్‌ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం అందుతుంది. కానీ, భారీ బౌండరీల కారణంగా స్పిన్ బౌలర్లు కూడా మ్యాచ్‌లో సత్తా చాటే అవకాశం ఉంది. వాతావరణం గురించి మాట్లాడితే, జైపూర్‌లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉంటుంది.

RR vs LSG, ఐపీఎల్ 2024: శాంసన్ వర్సెస్ రాహుల్ పోరుకు రెడీ.. అందరి చూపు ఆ ఖతర్నాక్ ప్లేయర్‌పైనే..
Rr Vs Lsg
Follow us on

Rajasthan Royals vs Lucknow Super Giants Match Preview and Predicted XI: ఐపీఎల్ 2024 (IPL 2024)లో భాగంగా నేడు అంటే మార్చి 24 ఆదివారంనాడు డబుల్ హెడర్స్ జరగనున్నాయి. తొలి మ్యాచ్ అంటే ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG) మధ్య జరగనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయం తర్వాత మళ్లీ మైదానంలోకి రానున్నాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్ మరోసారి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇందులో రాజస్థాన్ 2 సార్లు గెలుపొందగా, లక్నో జట్టు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. గతేడాది జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్.

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్.

పిచ్, వాతావరణం..

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మైదానంలో సగటు స్కోరు దాదాపు 160గా ఉంది. పిచ్‌ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం అందుతుంది. కానీ, భారీ బౌండరీల కారణంగా స్పిన్ బౌలర్లు కూడా మ్యాచ్‌లో సత్తా చాటే అవకాశం ఉంది. వాతావరణం గురించి మాట్లాడితే, జైపూర్‌లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, వేడితో ఆటగాళ్ళు ఇబ్బందులు పడొచ్చు.

ప్రత్యక్ష ప్రసారం..

మ్యాచ్ టాస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ మ్యాచ్‌ను జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..