LSG vs PBKS, IPL 2024: దంచి కొట్టిన డికాక్, కృనాల్‌.. పంజాబ్ ముందు భారీ టార్గెట్‌..

పంజాబ్‌కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు బ్యాటర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా ఓపెనర్ క్వింటన్ డికాక్ (54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ కొట్టి శుభారంభం అందించాడు.

LSG vs PBKS, IPL 2024: దంచి కొట్టిన డికాక్, కృనాల్‌.. పంజాబ్ ముందు భారీ టార్గెట్‌..
Lucknow Super Giants

Updated on: Mar 31, 2024 | 12:08 AM

పంజాబ్‌కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు బ్యాటర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా ఓపెనర్ క్వింటన్ డికాక్ (54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ కొట్టి శుభారంభం అందించాడు. ఆ తర్వాత కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక చివరిలో కృనాల్ పాండ్య (43 నాటౌట్ ; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్ 3, అర్ష్‌దీప్‌ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

 

ఇవి కూడా చదవండి

లక్నో సూపర్ జెయింట్స్

క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

ఇంపాక్ట్ ప్లేయర్: ఆష్టన్ టర్నర్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, దీపక్ హుడా, కె.గౌతమ్.

పంజాబ్ కింగ్స్

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభాసిమ్రాన్ సింగ్, రిలే రూసో, తనయ్ త్యాగరాజన్, విద్వాత్ కవీరప్ప, హర్‌ప్రీత్ భాటియా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..