
ఐపీఎల్ 2024 వేలానికి ముందుగా ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో భారీ ధరకు కొనుగోలు చేసిన కొంతమంది ప్లేయర్స్‌కు ఉద్వాసన పలికేందుకు సిద్దమైంది ఫ్రాంచైజీ. గత సీజన్‌లో రూ. 17.5 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌తో పాటు దాదాపుగా రూ. 8 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకున్న జోఫ్రా ఆర్చర్‌ను సైతం విడుదల చేయాలని ముంబై భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో గ్రీన్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేదు. 16 మ్యాచ్‌ల్లో 452 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే ఆర్చర్ కూడా కేవలం 5 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో వీరిని విడిచిపెట్టి.. తక్కువ ధరకు కొనుగోలు చేయాలని వ్యూహాలు రచిస్తోంది ముంబై ఇండియన్స్.
ముంబై కీలక బౌలర్ జస్ప్రిత్ బుమ్రా తిరిగి ఫామ్ సాధించడంతో.. అటు రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడ్‌లో దక్కించుకోవాలని చూస్తోంది. అదే విధంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా తిరిగి జట్టులోకి చేర్చుకోవాలని ముంబై చూస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరితో పాటు క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, సందీప్ వారియర్, రిలే మెరెడిత్‌లను సైతం విడుదల చేయనుంది ముంబై. కాగా, ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్టుకు నవంబర్ 26 సాయంత్రం 4 గంటలకు ఆఖరి తేదీ. ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి వస్తే.. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఊడుతుందో.? ఉంటుందో.? వేచి చూడాలి.
Mumbai Indians Likely To Release Cameron Green And Hardik Pandya Will Return Back To Its Previous Franchise Mumbai Indians.
📸 BCCI/IPL#IPLTrade #MumbaiIndians #HardikPandya #IPL2024Auction #CameronGreen #IPL2024 pic.twitter.com/LDJwbcxjix
— Cricket Clue (@cricketclue247) November 25, 2023