IPL 2024: ఈసారి చెన్నైకు నో ఛాన్స్.. ప్లే ఆఫ్‌ చేరే టాప్-4 టీమ్స్ ఇవే.. జోస్యం చెప్పిన ఆర్‌సీబీ మాజీ ప్లేయర్‌

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కె) పటిష్ట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ని ఓడించి శుభారంభం చేసింది. విశేషమేమిటంటే, మొదటి గేమ్ ముగిసిన వెంటనే, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఈసారి ప్లేఆఫ్ దశకు వెళ్లే నాలుగు జట్లను అంచనా వేశాడు

IPL 2024: ఈసారి చెన్నైకు నో ఛాన్స్.. ప్లే ఆఫ్‌ చేరే టాప్-4 టీమ్స్ ఇవే.. జోస్యం చెప్పిన ఆర్‌సీబీ మాజీ ప్లేయర్‌
IPL 2024

Updated on: Mar 23, 2024 | 3:02 PM

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కె) పటిష్ట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ని ఓడించి శుభారంభం చేసింది. విశేషమేమిటంటే, మొదటి గేమ్ ముగిసిన వెంటనే, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఈసారి ప్లేఆఫ్ దశకు వెళ్లే నాలుగు జట్లను అంచనా వేశాడు. క్రిస్ గేల్ ప్రకారం, RCB జట్టు ఈసారి ప్లే ఆఫ్ ఆడటం ఖాయం. బలమైన బ్యాటర్లు ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశ ముగిసే సమయానికి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని అంచనా వేశాడీ కరేబియన్ క్రికెటర్. ఈసారి ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని చెప్పిన గేల్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై జట్టు మంచి ప్రదర్శన చేస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే, ముంబై ఇండియన్స్ కూడా టాప్ ఫోర్‌లో కనిపిస్తుంది.

దీంతో పాటు సంజూ శాంసన్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా టాప్‌-4లో కనిపించనుంది. గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ మంచి ప్రదర్శన చేస్తోంది. అందువల్ల ఈసారి ఆర్ఆర్ టీమ్ నుంచి అద్భుతమైన ప్రదర్శనను ఆశించవచ్చని గేల్ అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా టాప్-4లో కనిపిస్తుందన్నాడీ విండీస్ మాజీ ప్లేయర్‌. శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం, ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన ఫామ్, రింకూ సింగ్ ఫినిషింగ్ కేకేఆర్ జట్టుకు ప్లస్ పాయింట్లు అన్నాడు. KKR జట్టు కూడా ప్లేఆఫ్స్ కోసం ఎదురుచూస్తుందని క్రిస్ గేల్ చెప్పాడు. క్రిస్ గేల్ ప్రకారం, ప్లేఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడతాయి. అయితే ఇందులో ధోని చెన్నై సూపర్ కింగ్స్ లేకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. మరి గేల్ చెప్పిన ఈ జోస్యం నిజమవుతుందో లేదో వేచి చూద్దాం.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ ఆవిష్కరణలో క్రిస్ గేల్


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..