ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు మరోసారి ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. గురువారం, హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు IPL మ్యాచ్ జరగనుంది.
రాచకొండ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ప్రకటన ప్రకారం, మే 4 మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 11:30 వరకు ఆంక్షలు వర్తిస్తాయి. అన్ని రకాల భారీ వాహనాలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
ఈ మేరకు ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలు ,ట్రక్కులు, వాటర్ ట్యాంక్ లు ఇతర భారీ వాహనాలకు స్టేడియం చుట్టుపక్కలకు అనుమతి నిరాకరించినట్లు వారు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..