Shreyas Iyer: 5 ఏళ్లు.. ఆడింది 17 మ్యాచ్‌లే.. శ్రేయాస్ స్థానాన్ని భర్తీ చేసేది ఆ ప్లేయరే.!

|

Mar 15, 2023 | 7:54 PM

ఐపీఎల్ 2023 మొదటి విండో నుంచి శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నట్లు తెలిసిందే. గాయం కారణంగా ఈ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్..

Shreyas Iyer: 5 ఏళ్లు.. ఆడింది 17 మ్యాచ్‌లే.. శ్రేయాస్ స్థానాన్ని భర్తీ చేసేది ఆ ప్లేయరే.!
Shreyas Iyer
Follow us on

ఐపీఎల్ 2023 మొదటి విండో నుంచి శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నట్లు తెలిసిందే. గాయం కారణంగా ఈ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్‌తో జరిగే వన్డేలు, ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లలోనూ ఆడలేదు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సీజన్ స్టార్ట్ కాకముందే ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు అయితే ప్రారంభ మ్యాచ్‌లకు కేకేఆర్‌కు కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు క్వశ్చన్. కెప్టెన్సీలోనే కాదు, బ్యాట్స్‌మెన్‌గా కూడా అయ్యర్ కోల్‌కతాకు కీ ప్లేయర్.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లకు కేకేఆర్ కెప్టెన్‌గా ఈ ప్లేయర్స్ ముందు వరుసలో ఉన్నారు. లిస్టులో ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవమున్న దిగ్గజాలు సైతం ఉన్నారు. అయితే వారి కంటే, ఫస్ట్‌గా ఫ్రాంచైజీ కెప్టెన్సీని అప్పగించేందుకు ఎన్నుకున్న ప్లేయర్ పేరు ఆశ్చర్యపరుస్తోంది.

ఐదేళ్లలో 17 మ్యాచ్‌లు, 251 పరుగులు..

కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రింకూ సింగ్ కెప్టెన్సీ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. IPL అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రింకూ సింగ్ కేవలం 17 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతడు 251 పరుగులు చేశాడు. ఇక గతేడాది రింకూ సింగ్ అత్యుత్తమైన ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.

రింకూ సింగ్ ద్విపాత్రాభినయం..!

ఈసారి రింకూ సింగ్‌ అటు ప్లేయర్‌గానూ, ఇటు కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టాలి. కాగా, కెప్టెన్సీ జాబితాలో రింకూ సింగ్‌తో పాటు సునీల్ నరైన్, టిమ్ సౌథీ, నితీశ్ రాణా, షకీబ్ అల్ హసన్ కూడా ఉన్నారు. ఈ అంశంపై ఫ్రాంఛైజీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.