ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో 47 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే-ఆఫ్స్ రేసులో ఏకంగా 7 జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఏ నాలుగు జట్లు చేరుకుంటాయో ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టమే గానీ.. ఐపీఎల్‌లో కామెంటరీ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ నాలుగు జట్లు తప్పకుండా ప్లే-ఆఫ్స్ చేరుకుంటాయని.. లక్నో, రాజస్థాన్ జట్లు లీగ్ స్టేజిలోనే నిష్క్రమిస్తాయని చెప్పాడు. అలాగే పేలవ ఫామ్ కొనసాగిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడం అసాధ్యమని అన్నాడు.
ప్రస్తుతం గుజరాత్ 12 పాయింట్లతో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత లక్నో, చెన్నై, రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్, ఢిల్లీ ఉన్నాయి. వీటిలో చెన్నై, ముంబై, ఆర్సీబీ, గుజరాత్ ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు. మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న లక్నో, రాజస్థాన్ జట్లు ప్లే-ఆఫ్స్‌కు చేరవని భజ్జీ అంచనా వేస్తున్నాడు. రాయల్స్‌ను ముంబై వెనక్కి నెట్టగలదని.. అలాగే లక్నోకి బ్యాటింగ్‌లో పలు సమస్యలు ఉన్నాయని.. అవి అధిగమించాల్సి ఉంటుందని అన్నాడు. కాగా, ఆరేసి ఓటములతో అట్టడుగున ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే-ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యంగా మారింది. ఈ మూడు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో గెలవడమే కాకుండా.. నెట్ రన్‌రేట్‌ను కూడా బాగా మెరుగుపరుచుకోవాల్సి ఉంది.