IPL 2023 GT vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 44వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఢిల్లీ తరపున అమన్ ఖాన్ 51 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ 27, రిప్పల్ పటేల్ 23 పరుగులు చేశారు.
మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీశాడు. మోహిత్ శర్మకు రెండు, రషీద్ ఖాన్‌కు ఒక వికెట్ లభించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..