IPL 2023 Auction: మినీ వేలంలో ఎంట్రీ ఇచ్చిన ఆ ఇద్దరు ఆల్ రౌండర్లు.. కన్నేసిన ఫ్రాంచైజీలు.. ఈసారి రికార్డులు బద్దలవ్వాలిందే..

|

Dec 02, 2022 | 9:55 AM

డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న మినీ వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, గరిష్టంగా 87 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

IPL 2023 Auction: మినీ వేలంలో ఎంట్రీ ఇచ్చిన ఆ ఇద్దరు ఆల్ రౌండర్లు.. కన్నేసిన ఫ్రాంచైజీలు.. ఈసారి రికార్డులు బద్దలవ్వాలిందే..
Ipl 2023 Mini Auction
Follow us on

టీ20 వరల్డ్ కప్ 2022 ఛాంపియన్ ఆటగాళ్లు ఐపీఎల్ 2023(IPL 2023) కోసం వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఫ్రాంచైజీలన్నీ వారి కోసం పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఫైనల్ హీరో బెన్ స్టోక్స్, టోర్నీలో అత్యుత్తమ ఆటగాడు శామ్ కరణ్‌లపై అన్ని జట్లు పోటీకి రెడీ అయ్యాయి. ఇంగ్లండ్ విజయానికి కారణమైన ఈ ఇద్దరు స్టార్ ఆల్ రౌండర్లపై భారీ బిడ్లను వేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెలలో జరగనున్న వేలం కోసం ఇద్దరూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అత్యధిక బేస్ ప్రైస్ అంటే రూ.2 కోట్లను ఎంచుకున్నారు. వీరితో పాటు ఇతర విదేశీ ఆటగాళ్లు ఈ బేస్ ధరను ఎంచుకున్నారు. అయితే ఏ భారతీయ ఆటగాడు ఇందులో భాగం కాలేదు.

డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న మినీ వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిసెంబర్ 1 గురువారం వేలంలో పాల్గొనే ఆటగాళ్లపై ఈ సమాచారాన్ని అందించింది. ఇందులో 714 మంది భారతీయులు (క్యాప్డ్, అన్‌క్యాప్డ్‌తో సహా), 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అత్యధికంగా 57 మంది విదేశీయులు ఆస్ట్రేలియాకు చెందినవారు. వీరితో పాటు 20 మంది ఆటగాళ్లు కూడా అసోసియేట్ జట్లకు చెందినవారు.

అత్యధిక బేస్ ధర వద్ద 21 మంది ఆటగాళ్లు..

అదే సమయంలో ESPN-Cricinfo నివేదికలో, వేలం కోసం నిర్ణయించిన అత్యధిక బేస్ ధరలో ఇద్దరు ఇంగ్లండ్ ఆల్-రౌండర్లు సామ్ కరణ్, బెన్ స్టోక్స్ ఉన్నారు. సామ్ కరణ్ 2021 IPL సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, గాయం కారణంగా చివరి సీజన్‌లో ఆడలేకపోయాడు. అదే సమయంలో, బెన్ స్టోక్స్ కూడా 2021 సీజన్ ప్రారంభంలో గాయపడ్డాడు. ఈ సీజన్‌లో అలాగే గత సీజన్‌లో ఆడలేకపోయాడు. చివరి వరకు అతను రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మొత్తం 21 మంది ఆటగాళ్ల పేర్లను 2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఎంట్రీ చేశారు. వీరిలో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, ఆస్ట్రేలియా రైజింగ్ ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్ ఉన్నారు. అయితే ఈ జాబితాలో భారతీయులెవరూ లేరు. భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్ వంటి ఎంపిక చేసిన ఆటగాళ్ల బేస్ ధర కోటిగా ఎంచుకున్నారు.

రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ప్లేయర్స్..

శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, నికోలస్ పూరన్, కామెరాన్ గ్రీన్, నాథన్ కౌల్టర్-నైల్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్ ఆడమ్ మిల్నే, రిలే రస్సో, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఏంజెలో మాథ్యూస్, జాసన్ హోల్డర్.

1.5 కోట్ల బేస్ ప్రైస్ ప్లేయర్స్..

షాన్ అబాట్, రైలీ మెరెడిత్, ఝై రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..