
ఐపీఎల్‌లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో కొంతమంది ఆటగాళ్లకు ఈ కల నెరవేరనుంది. వారిలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉండడం గమనార్హం.

వాస్తవానికి, ఐపీఎల్‌లోని 6 జట్లలో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోర్నమెంట్‌లోని మొదటి 5 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. దీనికి కారణం 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే.. ఆఫ్రికన్ జట్టు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ గెలవాల్సిన అవసరం ఉంది.

ఈ సిరీస్‌లో విజయం సాధిస్తేనే ఆఫ్రికన్ జట్టు వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోతే క్వాలిఫైయింగ్ రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. దీంతో ఆఫ్రికన్ ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటారు.

నివేదికల ప్రకారం, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఐపీఎల్‌లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారతదేశానికి వచ్చే ముందు మార్చి చివరిలో నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడతారని బీసీసీఐకి తెలియజేసింది. ఆ విధంగా ఆఫ్రికన్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో టాప్ 6 టీంలకు భారీ షాక్‌లా మారింది. ఆ 6 జట్ల వివరాలు, ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్

ఢిల్లీ క్యాపిటల్స్- ఎన్రిక్ నోకియా, లుంగి ఎన్గిడి

ముంబై ఇండియన్స్- ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్

గుజరాత్ టైటాన్స్- డేవిడ్ మిల్లర్

లక్నో సూపర్‌జెయింట్స్- క్వింటన్ డి కాక్

పంజాబ్ కింగ్స్- కగిసో రబడ