IPL-2022: మార్చి చివరి వారంలో ఐపీఎల్-2022 ప్రారంభం.. వెల్లడించిన జైషా..

|

Jan 22, 2022 | 8:36 PM

ఐపీఎల్-2022 మార్చి చివరి వారంలో ప్రారంభం అవుతుందని బీసీసీఐ బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.

IPL-2022: మార్చి చివరి వారంలో ఐపీఎల్-2022 ప్రారంభం.. వెల్లడించిన జైషా..
Ipl 2022
Follow us on

ఐపీఎల్-2022 మార్చి చివరి వారంలో ప్రారంభం అవుతుందని బీసీసీఐ బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. IPL 15వ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని చాలా మంది టీమ్‌ యజమానులు కోరుకుంటున్నారని చెప్పారు.

IPL భారతదేశంలోనే నిర్వహించడానికి ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోబోమని షా స్పష్టం చేశారు. BCCI ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతపై రాజీపడలేదన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. IPL-2022 మెగా వేలం ఫిబ్రవరి 12-13 తేదీలలో జరుగుతుందని.. ఇందులో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు.

Read Also.. IND vs SA: సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ.. స్లో ఓవర్ రేటుతో ఫైన్ విధించిన ఐసీసీ..