IPL Purple Cap 2022: పర్పల్‌ క్యాప్‌ రేసులో మరింత ముందుకొచ్చిన హసరంగా.. చాహల్‌తో వికెట్‌ దూరంలో శ్రీలంక బౌలర్‌..

|

May 26, 2022 | 8:41 AM

IPL 2022 లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 27 క్వాలిఫైయర్‌ 2 జరుగుతుంది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. గుజరాత్‌ టైటాన్స్(GT) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. ఫైనల్‌ కోసం బెంగళూరు(RCB), రాజస్థాన్‌(RR) శుక్రవారం తలపడనున్నాయి...

IPL Purple Cap 2022: పర్పల్‌ క్యాప్‌ రేసులో మరింత ముందుకొచ్చిన హసరంగా.. చాహల్‌తో వికెట్‌ దూరంలో శ్రీలంక బౌలర్‌..
Purple Cap
Follow us on

IPL 2022 లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 27 క్వాలిఫైయర్‌ 2 జరుగుతుంది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. గుజరాత్‌ టైటాన్స్(GT) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. ఫైనల్‌ కోసం బెంగళూరు(RCB), రాజస్థాన్‌(RR) శుక్రవారం తలపడనున్నాయి. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లతో రాజస్థాన్‌ బౌలర్‌ చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్‌ హసరంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను 15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్‌ జాయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హసరంగా దీపక్‌ హుడాను ఔట్‌ చేసి 25వ వికెట్‌ తీశాడు. మెగా వేలంలో హసరంగాను బెంగళూరు 10 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. అతని వికెట్లలో అతను ఒక్కసారి నాలుగు వికెట్లు, మరోసారి 5 వికెట్లు తీశాడు.

అత్యధిక వికెట్ల తీసిన బౌలర్లలో రాజస్థాన్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోన్నాడు. చాహల్‌ 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. చాహల్ ప్రస్తుతం KKRపై హ్యాట్రిక్‌తో సాధించాడు. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చాహల్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. దీంతో హసరంగాకు చాహల్‌ ఒక్క వికెట్ తేడా మాత్రమే ఉంది. దీంతీ పర్పుల్‌ క్యాప్‌ ఎవరికి వస్తుందా అని ఆసక్తి నెలకొంది.
మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు కగిసో రబడ ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగో స్థానంలో హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. అతను తన పేస్‌తో చాలా మంది టాప్-క్లాస్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్‌ చేశాడు. పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌ హర్ష్‌దీప్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి