నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్(Harshal Patel) అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీసి, ముంబై టీంను ఓటమిదశగా నడిపించాడు. ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(RCB) టీంకు బ్యాడ్ న్యూస్ అందింది. ఈ కీలక బౌలర్.. తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. దీంతో ఆర్‌సీబీ కష్టాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్‌సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ తన సోదరి మరణ వార్తతో ఐపీఎల్ 2022 (IPL 2022) బయో-బబుల్ నుంచి నిష్క్రమించాడు. శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత, పటేల్ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన గురించి ఆయనకు సమాచారం అందింది. ఆ తర్వాత పూణే నుంచి ముంబై వెళ్లి తన ఇంటికి వెళ్లాడు. పటేల్ సోదరి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఏప్రిల్ 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో హర్షల్ జట్టులో చేరే అవకాశం ఉంది.
ముంబైపై రెండు వికెట్లు..
శనివారం జరిగిన డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. దీంతో పాటు రమణదీప్ సింగ్‌ను దినేష్ కార్తీక్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
ఇప్పటి వరకు లీగ్‌లో 6 వికెట్లు..
ఈ సీజన్‌లో హర్షల్ పటేల్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో హర్షల్ 16 ఓవర్లలో 86 పరుగులు ఇచ్చాడు.
Also Read: KKR vs DC Live Score, IPL 2022: పవర్ ప్లేలో అదరగొడుతోన్న ఢిల్లీ ఓపెనర్లు.. స్కోరెంతంటే?