GT vs RR: దంచికొట్టిన బట్లర్.. గుజరాత్‌ టార్గెట్‌ 189 పరుగులు

|

May 24, 2022 | 9:46 PM

GT vs RR: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట టాస్‌

GT vs RR: దంచికొట్టిన బట్లర్.. గుజరాత్‌ టార్గెట్‌ 189 పరుగులు
Jose Butler
Follow us on

GT vs RR: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట టాస్‌ గెలిచిన గుజరాత్ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. గుజరాత్‌కి 189 పరుగుల టార్గెట్‌ని నిర్దేశించింది. రాజస్థాన్‌ ప్లేయర్లలో ఓపెనర్‌ బట్లర్ అద్భుత ఆటతీరుని ప్రదర్శించాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. దాదాపు చివరి ఓవర్‌ వరకు క్రీజులో ఉండి స్కోరుని పెంచడానికి ప్రయత్నించాడు. కెప్టెన్‌ సంజు శామ్సన్‌ కూడా తృటిలో హాఫ్ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 26 బంతుల్లో ఫోర్లు 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. దేవదత్‌ పాడిక్కల్‌ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌, రవి శ్రీనివాసన్‌కి ఒక వికెట్‌, హార్దిక్ పాండ్య ఒక వికెట్‌, మహ్మద్‌ షమికి ఒక వికెట్‌ దక్కింది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి