IPL 2022: ప్లేఆఫ్‌ బరిలో కొత్త జట్లు.. లిస్టులో చేరిన మరో రెండు.. 47 మ్యాచ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?

|

May 03, 2022 | 4:26 PM

IPL Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. ఇందులో లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు తలపడనున్నాయి.

IPL 2022: ప్లేఆఫ్‌ బరిలో కొత్త జట్లు.. లిస్టులో చేరిన మరో రెండు.. 47 మ్యాచ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?
Ipl 2022 Playoffs
Follow us on

ఐపీఎల్ 2022( IPL 2022)లో ఇప్పటివరకు 47 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ దశలో ఇంకా 23 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంటే, ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లను నిర్ణయించడానికి ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలను చూస్తుంటే కొన్ని జట్లు ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. అదే సమయంలో, కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్ రేసు(IPL 2022 Playoffs)లో నిలిచిన జట్లను ఇప్పుడు చూద్దాం..

ప్లేఆఫ్ లిస్టులో ఆ రెండు జట్లు దాదాపు ఖాయమే..

గుజరాత్ తన 9 మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. ఈ జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే.. ఈ జట్టు తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లో ఓడినా.. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుందని చెప్పవచ్చు. గత ఐపీఎల్ సీజన్‌లలో 14 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లు గెలిచి జట్లు సులభంగా ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు చేరుకోవడం కూడా గమనించవచ్చు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్ కూడా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. జట్టుకు ఇంకా 4 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 4 మ్యాచ్‌ల్లో లక్నో ఒక్క మ్యాచ్‌నైనా గెలిచినా, ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపుగా ఖాయం అవుతుంది.

ముంబై ఔట్.. అదే దారిలో CSK, KKR..

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన తొమ్మిద మ్యాచ్‌ల్లో ఎనిమిది మ్యాచ్‌లలో ఓడిపోయింది. మిగిలిన 6 మ్యాచ్‌లు గెలిచినా.. ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టమే. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా ఇప్పటివరకు చెరో 6 మ్యాచ్‌లలో ఓడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే. అయితే ఈ రెండు జట్ల గత మ్యాచ్‌లను చూస్తుంటే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ప్లేఆఫ్ బరిలో నిలిచేది ఈ ఐదు జట్లే..

రాజస్థాన్ రాయల్స్ 6 విజయాలతో IPL ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా చెరో 5 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. ఈ మూడు జట్లలో ఏదైనా రెండు చివరి నాలుగు జట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా చెరో 4 మ్యాచ్‌లలో గెలిచి ప్లేఆఫ్స్ ఆడాలని కోరుకుంటున్నాయి. ఈ విధంగా, మొత్తం ఐదు జట్లు 9 నుంచి 10 మ్యాచ్‌లలో విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022, Orange Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన శ్రేయాస్‌ అయ్యర్.. వెనుకబడిన హార్దిక్ పాండ్య..!

IPL 2022: విలన్లుగా మారిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. రూ. 16 కోట్లు వేస్ట్ అంటోన్న నెటిజన్లు.. ఎవరో తెలుసా!