IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?

|

Feb 11, 2022 | 2:47 PM

లీగ్ ఐపీఎల్ 15వ సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. ఐపీఎల్(IPL) చరిత్రలో ఇది ఐదవ మెగా వేలం. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్‌ను మనం మళ్లీ చూడలేకపోవచ్చు. ఈ మెగా వేలం గురించి..

IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?
Ipl 2022 Auction
Follow us on

IPL 2022 Auction: లీగ్ ఐపీఎల్ 15వ సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. ఐపీఎల్(IPL) చరిత్రలో ఇది ఐదవ మెగా వేలం. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్‌ను మనం మళ్లీ చూడలేకపోవచ్చు. ఈ మెగా వేలం గురించి అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనున్న మెగా వేలం(IPL 2022 Mega Auction)లో 590 మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. మెగా వేలంలో కొంతమంది అనుభవజ్ఞులతోపాటు కీలక పేర్లు కూడా ఉన్నాయి. వీరు గత కొన్నేళ్లుగా నిలకడగా ప్రదర్శన ఇస్తుండడంతో అన్ని జట్లు కూడా ఈ ప్లేయర్లపై కన్నేశాయి. ఇటీవల బీసీసీఐ వేలం కోసం 590 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో 10 మంది ఆటగాళ్లను రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో మార్క్యూ ప్లేయర్‌లుగా ఎంపిక చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ వేలంలోకి ప్రవేశిస్తుంది. అయితే ముగ్గురు ఆటగాళ్లు సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను తీసుకోవడానికి చాలా జట్లు ఎదురుచూస్తున్నాయి. అయితే, రాజస్థాన్‌ రాయల్స్‌ టీం వీరిపై కన్నేసింది.

ట్రెంట్ బౌల్ట్..
న్యూజిలాండ్ యొక్క లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆల్ టైమ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ట్రెంట్ బౌల్ట్ కొత్త బంతితో చాలా ప్రాణాంతకంగా మారాడు. వేలంలో బోల్ట్ పేరు మారుమోగనుంది. అంతకుముందు బోల్ట్ గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్ టీమ్‌లో భాగంగా ఉన్నాడు. అతను ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. 2020 సీజన్‌లో 25 వికెట్లు తీశాడు. కానీ ముంబై ఈసారి అతన్ని రిటైన్ చేయలేదు. ఇటువంటి పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్‌తో వేలంలో విదేశీ ఫాస్ట్ బౌలర్‌ల స్లాట్‌లో బోల్ట్ మంచి ఎంపిక అని నిరూపించవచ్చు.

శిఖర్ ధావన్..
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా బలమైన, ప్రత్యేకమైన ఆటగాడు. కొన్నాళ్లుగా ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతను మొదటి సీజన్ నుంచి ఈ లీగ్‌లో భాగమయ్యాడు. ఆ తర్వాత నుంచి అతను బాగా రాణిస్తున్నాడు. ధావన్ ఇప్పటి వరకు 192 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, ఇందులో 5784 పరుగులు చేశాడు. ఈ కాలంలో ధావన్ చాలా ఫ్రాంచైజీలతో ఆడాడు.

అయితే, అతని అత్యుత్తమ ప్రదర్శన ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కింది. ధావన్ రిటైన్ కాకపోవడంతో ఈసారి వేలంలో కనిపించబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ధావన్‌ను టార్గెట్ చేయగలదు. ఏది ఏమైనప్పటికీ, జోస్ బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను తెరవడానికి అతను మంచి ఎంపిక కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో, రాజస్థాన్ రాయల్స్ ఈ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్‌ను లక్ష్యంగా చేసుకుంటుందనడంలో సందేహం లేదు.

ఫాఫ్ డు ప్లెసిస్..
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి వచ్చినప్పటి నుంచి నాలుగు సీజన్‌లలో రెండుసార్లు టైటిల్ విజయానికి దోహదం చేయగలిగాడు. ఫాఫ్ చాలా నిష్ణాతుడైన బ్యాట్స్‌మన్. అతను 2018, 2021 సీజన్‌లలోని బిగ్ మ్యాచ్‌లలో తన ప్రదర్శనలతో మంచి ఫినిషర్‌ అని నిరూపించుకున్నాడు.

ఫాఫ్ డు ప్లెసిస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేయలేదు. దాంతో అతను వేలంలో కనిపించబోతున్నాడు. గత సీజన్‌లో డు ప్లెసిస్ టాప్ స్కోరర్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ బ్యాట్స్‌మెన్ టాప్ ఆర్డర్‌లో ఏ ఆర్డర్‌లోనైనా ఆడగలడు. అతని అనుభవంతో ఏ జట్టుకైనా ప్రయోజనం చేకూరుస్తాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫాఫ్‌ని తీసుకురావడం ద్వారా తమ జట్టును బలోపేతం చేయాలని అనుకుంటుంది.

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు షాక్.. తప్పుకున్న ఆ జట్టు బ్యాటింగ్ కోచ్..

IPL 2022 Auction Live Streaming: 590 మంది ఆటగాళ్ల భవితవ్యం.. IPL 2022 వేలం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే..?