IPL 2022, Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్న బంగ్లాదేశ్ బౌలర్.. భారీ ఆఫర్‌ ఇచ్చిన గంభీర్..

|

Mar 21, 2022 | 5:20 PM

లక్నో సూపర్ జెయింట్స్ మార్క్ వుడ్ స్థానంలో ఎంపిక కోసం వెతుకుతోంది. అతన్ని ఫ్రాంచైజీ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ, అతను గాయపడడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.

IPL 2022, Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్న బంగ్లాదేశ్ బౌలర్.. భారీ ఆఫర్‌ ఇచ్చిన గంభీర్..
Ipl 2022 Lucknow Super Giants
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి టోర్నీలో ఎనిమిది జట్లకు బదులు 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, లీగ్ మునుపటి కంటే మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తున్నారు. ఐపీఎల్ 2022(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, గాయాలతో కొంతమంది ఆటగాళ్లు.. లీగ్‌ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్(Mark Wood) గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం అతని భర్తీ కోసం ఫ్రాంచైజీ తీవ్రంగా వెతుకుతోంది.

మీడియా నివేదికల ప్రకారం, మార్క్ వుడ్ స్థానంలో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ బంగ్లాదేశ్ ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీజన్ మొత్తానికి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్‌ను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తస్కిన్‌కి ఓ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆఫర్‌ను తస్కిన్ ఇంకా అంగీకరించలేదని తెలుస్తోంది. ఒకవేళ తస్కిన్ లక్నో జట్టులోకి వస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.

IPL 2022 మెగా వేలంలో మార్క్ వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను గాయపడడంతో టోర్నమెంట్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ కారణంగా ఫ్రాంచైజీ ఫాస్ట్ బౌలర్ కోసం వెతుకుతోంది.

కాగా, లక్నో టీం ఇప్పటికీ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ల సైన్యాన్ని కలిగి ఉంది. ఫ్రాంచైజీలో అవేష్ ఖాన్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అంకిత్ రాజ్‌పుత్, మొహ్సిన్ ఖాన్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అదే సమయంలో, ఫ్రాంచైజీ వేలానికి ముందు కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను రిటైన్ చేసుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పూర్తి జట్టు – మయాంక్ యాదవ్ (రూ. 20 లక్షలు), ఎవిన్ లూయిస్ (రూ. 2 కోట్లు), అవేష్ ఖాన్ (రూ. 10 కోట్లు), జాసన్ హోల్డర్ (రూ. 8.75 కోట్లు), కృనాల్ పాండ్యా (రూ. 8.25 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 6.75 కోట్లు), మనీష్ పాండే (రూ. 4.60 కోట్లు), దీపక్ హుడా (రూ. 5.75 కోట్లు), కరణ్ శర్మ (రూ. 20 లక్షలు), కైల్ మేయర్స్ (రూ. 50 లక్షలు), ఆయుష్ బదోని (రూ. 20 లక్షలు), మొహ్సిన్ ఖాన్ (రూ. 20 లక్షలు), మనన్ వోహ్రా (రూ. 20 లక్షలు), షాబాజ్ నదీమ్ (రూ. 50 లక్షలు), దుష్మంత చమీరా (రూ. 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (రూ. 90 లక్షలు), అంకిత్ రాజ్‌పుత్ (రూ. 50 లక్షలు), కెఎల్ రాహుల్ (17 Cr), మార్కస్ స్టోయినిస్ (రూ. 9.20 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు).

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పూర్తి షెడ్యూల్:

మ్యాచ్ నం మ్యాచ్ తేదీ రోజు సమయాలు  వేదిక
4 GT vs LSG మార్చి 28, 2022 సోమవారం 7:30 PM వాంఖడే స్టేడియం
7 LSG vs CSK మార్చి 31, 2022 గురువారం 7:30 PM బ్రబౌర్న్ – CCI
12 SRH vs LSG ఏప్రిల్ 4, 2022 సోమవారం 7:30 PM డివై పాటిల్ స్టేడియం
15 LSG vs DC ఏప్రిల్ 7, 2022 గురువారం 7:30 PM డివై పాటిల్ స్టేడియం
20 RR vs LSG ఏప్రిల్ 10, 2022 ఆదివారం 7:30 PM వాంఖడే స్టేడియం
26 MI vs LSG ఏప్రిల్ 16, 2022 శనివారం 3:30 PM బ్రబౌర్న్ – CCI
31 LSG vs RCB ఏప్రిల్ 19, 2022 మంగళవారం 7:30 PM డివై పాటిల్ స్టేడియం
37 LSG vs MI ఏప్రిల్ 24, 2022 ఆదివారం 7:30 PM వాంఖడే స్టేడియం
42 PBKS vs LSG ఏప్రిల్ 29, 2022 శుక్రవారం 7:30 PM MCA స్టేడియం, పూణే
45 DC vs LSG మే 1, 2022 ఆదివారం 3:30 PM వాంఖడే స్టేడియం
53 LSG vs KKR మే 7, 2022 శనివారం 3:30 PM MCA స్టేడియం, పూణే
57 LSG vs GT మే 10, 2022 మంగళవారం 7:30 PM MCA స్టేడియం, పూణే
63 LSG vs RR మే 15, 2022 ఆదివారం 7:30 PM బ్రబౌర్న్ – CCI
66 KKR vs LSG మే 18, 2022 బుధవారం 7:30 PM డివై పాటిల్ స్టేడియం

Also Read: Women’s World Cup 2022: భారత్‌కు కలిసొచ్చిన పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసుకు మరింత చేరువగా..

Harbhajan Singh: పెద్దల సభలో అడుగుపెట్టనున్న హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ చేసిన ఆప్..