IPL 2022: ఆ 8 కోట్ల ప్లేయర్‌కు తలనొప్పిగా మారిన హార్దిక్ పాండ్యా.. కొట్లాట తప్పేలా లేదుగా!

|

Apr 18, 2022 | 6:14 PM

దేశీయ, విదేశీ ప్లేయర్లు.. తమ ఫామ్‌ను తిరిగి రాబట్టుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఓ మంచి ఫ్లాట్‌ఫార్మ్‌గా మారింది. ఇక్కడ చాలామంది..

IPL 2022: ఆ 8 కోట్ల ప్లేయర్‌కు తలనొప్పిగా మారిన హార్దిక్ పాండ్యా.. కొట్లాట తప్పేలా లేదుగా!
Hardik Pandya
Follow us on

దేశీయ, విదేశీ ప్లేయర్లు.. తమ ఫామ్‌ను తిరిగి రాబట్టుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఓ మంచి ఫ్లాట్‌ఫార్మ్‌గా మారింది. ఇక్కడ చాలామంది అద్భుతమైన ప్రదర్శన కనబరిచి.. జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫామ్‌లో లేని ఇండియన్ ప్లేయర్స్.. తమ ఫామ్‌ను తిరిగి రాబట్టేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అందుకు ఉదాహరణే హార్దిక్ పాండ్యా.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా.. తన పేలవ ఫామ్ కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలం నుంచి టీ20లు, వన్డేలకు దూరంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా.. ఇక టెస్టుల విషయానికొస్తే.. 2018, ఆగష్టు 30వ తేదీన హార్దిక్ తన చివరి టెస్ట్ ఆడాడు. మొదటి వెన్ను గాయంతో బాధపడిన హార్దిక్.. దాని నుంచి కోలుకున్నా.. బౌలింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్‌గా జట్టులో స్థానం దక్కించుకున్న హార్దిక్ పాండ్యా.. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లలోనూ విఫలం కావడంతో.. ఆ తర్వాత సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హార్దిక్‌ను జట్టు నుంచి తొలగించారు. యువ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌కు స్థానం కల్పించారు. అయితే ఇప్పుడు సీన్ కాస్తా రివర్స్ అయింది.

ఐపీఎల్ 2022 మెగా వేలంలో హార్దిక్ పాండ్యాను రూ. 15 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా.. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 2 అర్ధ సెంచరీలతో 228 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.

అయితే కేకేఆర్ యువ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. వెంకటేష్ అయ్యర్ టోర్నీ ఆరంభంలో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మంచిగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు. ఇక ఇదే ఫామ్ కొనసాగితే.. జాతీయ జట్టులో కచ్చితంగా ఇతడి స్థానాన్ని హార్దిక్ పాండ్యా చేజిక్కించుకునే అవకాశం ఉంది. దీని బట్టి చూస్తే ఈ ఇద్దరి ఆల్‌రౌండర్లు జాతీయ జట్టుకు ఎంపిక అవ్వాలంటే.. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు చూపించాల్సిందే.