ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 163 విజయలక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 50(4 ఫోర్లు, ఒక సిక్స్) చేసి జట్టును ఆదుకున్నాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35(5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో రాణించాడు. వెడ్ 19, శుభ్‌మన్‌గిల్ 7, సాయి సూదర్శన్ 11, మిల్లర్ 12, తేవాతియా 6 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జాన్‌సెన్, ఇమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.
Read Also..RR vs LSG: ఎవరీ పింక్ ఆర్మీ కొత్త అస్త్రం.. చివరి ఓవర్ స్పెషలిస్ట్‌గా ఎలా మారాడు?