IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..

|

Mar 18, 2022 | 1:14 PM

IPL Controversies: IPL 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు, లీగ్ చరిత్రలో ఐదు అతిపెద్ద వివాదాలను ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..
Ipl Controversies
Follow us on

IPL Controversies: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008(Indian Premier League)లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ లీగ్ 15వ ఎడిషన్(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్ ప్రపంచ క్రికెట్‌కు ఎందరో స్టార్ ఆటగాళ్లను అందించింది. 8 టీంలతో మొదలైన ఐపీఎల్ లీగ్.. ప్రస్తుతం 10 టీంలకు చేరుకుంది. ఈ ఏడాది జరిగే లీగ్ ఎన్నో రకాలుగా ప్రత్యేకతలను సంతరించుకుంది. అయితే ఈ లీగ్‌ చరిత్రలో కొన్ని మచ్చలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఐదు అతిపెద్ద వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1- స్పాట్ ఫిక్సింగ్..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌పై 2013లో అతిపెద్ద మచ్చ పడింది. నిజానికి ఐపీఎల్ 2013లో ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందులో భారత ఫాస్ట్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా కూడా అరెస్టయ్యారు. దీంతో వీరందరిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే, శ్రీశాంత్ దానిని సవాలు చేయడంతో అతని శిక్షను తగ్గించారు.

2- చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై నిషేధం..

బెట్టింగ్ వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రా కూడా దోషులుగా తేలారు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధించారు.

3- షారుక్ ఖాన్‌పై వేటు..

IPL 2012లో KKR యజమాని షారుక్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురయ్యాడు. షారుక్‌ను గ్రౌండ్‌లోకి రాకుండా సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. దీంతో బాద్ షాకు కోపం వచ్చింది. దీనిపై గ్రౌండ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుక్‌ను స్టేడియంలోకి రాకుండా నిషేధించింది. అయితే ఈ నిషేధాన్ని 2015లో ఎత్తేశారు.

4- హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదం..

ఐపీఎల్ తొలి వివాదం ఈ లీగ్ తొలి సీజన్‌లోనే జరిగింది. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ని బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. నిజానికి, ఏప్రిల్ 25, 2008న మొహాలీలో కింగ్స్ XI పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించాడు. భజ్జీ అతడిని చెంపదెబ్బ కొట్టాడు. దీని తర్వాత హర్భజన్ 11 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు.

5- లలిత్ మోదీపై జీవితకాల నిషేధం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను లలిత్ మోడీ ప్రారంభించాడు. అయితే, 2010లో, అతను డబ్బును దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో BCCI అతనిని పదవి నుంచి సస్పెండ్ చేసింది. దీని తరువాత, 2013 సంవత్సరంలో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని నిరూపన అయింది. క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల నుంచి BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది.

Also Read: Team India: కెరీర్ చివరి వన్డేలో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. విరాట్‌తో కలిసి పాకిస్తాన్‌ తాటతీసిన భారత దిగ్గజం

ICC Womens World Cup 2022: ఉత్కంఠ మ్యాచులో బంగ్లా తడబాటు.. అద్భుత విజయంతో భారత్‌ను వెనక్కునెట్టిన విండీస్..