DC vs RCB Score: దంచికొట్టిన దినేశ్‌ కార్తీక్‌.. రాణించిన మ్యాక్సీ.. ఢిల్లీ టార్గెట్‌ ఎంతంటే..

|

Apr 16, 2022 | 9:42 PM

Delhi Capitals Royal Challengers vs Bangalore Score: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరోసారి అదరగొట్టాడు. ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఫోర్లు, సిక్స్‌ లతో చెలరేగాడు.

DC vs RCB Score: దంచికొట్టిన దినేశ్‌ కార్తీక్‌.. రాణించిన మ్యాక్సీ.. ఢిల్లీ టార్గెట్‌ ఎంతంటే..
Dinesh Karthik
Follow us on

Delhi Capitals Royal Challengers vs Bangalore Score: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరోసారి అదరగొట్టాడు. ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఫోర్లు, సిక్స్‌ లతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే 65 పరుగులు చేసి బెంగళూరుకు 189 పరుగుల భారీ స్కోరు సాధించిపెట్టాడు. అతని ఇన్నింగ్స్‌ లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ లు ఉండడం విశేషం. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (55), షాబాజ్‌ అహ్మద్‌ (32) రాణించారు. కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అనూజ్‌ రావత్‌ (0), డుప్లెసిస్‌ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆతర్వాత కోహ్లీ (12) కూడా దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరగడంతో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ప్రభుదేశాయ్‌ (6)తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 92 పరుగుల వద్ద మ్యాక్సీ కూడా పెవిలియన్‌కు చేరుకోవడంతో ఆర్సీబీ కష్టాల్లో పడినట్లైంది. అయితే షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌ అద్భుతంగా ఆడారు. మొదట్లో సంయమనంతో ఆడిన వీరు ఆ తర్వాత ఫోర్లు, సిక్స్ లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా కార్తీక్‌ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్స్ లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్‌ వేసిన 18 ఓవర్లో అతను ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఇక చివరి ఓవర్లోనూ 17 పరుగులు రావడంతో ఢిల్లీ ముందు బెంగళూరు భారీ టార్గెట్‌ను ఉంచింది.

కాగా మొదట్లో కట్టుదిట్టంగా బంతులేసిన ఢిల్లీ బౌలర్లు ఆ తర్వాత పట్టుతప్పారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ (27/1) మాత్రమే కాస్తా పర్వాలేదనిపించాడు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (48/1), కుల్దీప్‌ యాదవ్‌ (46/1), ఖలీల్‌ అహ్మద్‌ (36/1) భారీగా రన్స్ ఇచ్చారు.

Also Read: Samajwadi Party: పార్టీ పునర్జీవం కోసం స్వయంగా రంగంలోకి దిగిన ములాయం సింగ్ యాదవ్

Rahul Gandhi Tour: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరు!

Instant Dosa Recipe: ఈజీగా టేస్టీగా 15 నిమిషాల్లో తయారు చేసుకునే ఓట్స్ దోశ రెసిపీ మీ కోసం..