IPL 2021: వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. పెరుగుతున్న కేసులు.. కలవరపెడుతున్న కోవిడ్‌

|

Apr 06, 2021 | 12:49 PM

IPL 2021: ఐపీఎల్‌ 2012 సీజన్‌ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌ 9 నుంచి మే 30వ తేదీ వరకు ఐపీఎల్‌ 2021 సీజన్‌ మ్యాచ్‌లు జరుగనుండగా, ముంబాయి, చెన్నై,...

IPL 2021: వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. పెరుగుతున్న కేసులు.. కలవరపెడుతున్న కోవిడ్‌
Wankhede Stadium
Follow us on

IPL 2021: ఐపీఎల్‌ 2012 సీజన్‌ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌ 9 నుంచి మే 30వ తేదీ వరకు ఐపీఎల్‌ 2021 సీజన్‌ మ్యాచ్‌లు జరుగనుండగా, ముంబాయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ సిటీలు మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే టోర్నీ ఫస్ట్‌ మ్యాచ్‌ చెన్నైలో చెపాక్‌ స్టేడియంలో జరుగనుండగా, రెండో మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్‌ 10న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య కొనసాగనుంది.

అయితే తాజాగా వాంఖడే స్టేడియంలోని ఇటీవల 8 మంది గ్రౌండ్స్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌ తేలింది. పెరుగుతున్న కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది.దాంతో చెన్నై, ఢిల్లీ మధ్య ఏప్రిల్‌ 10వ తేదీన మ్యాచ్‌ జరగడంపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తాన్ని బయో-సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. వాంఖడే స్టేడియంలో మొత్తం 19 మంది గ్రౌండ్స్‌మెన్‌ పని చేస్తుండగా, ఇందులో ఏకంగా 8 మంది కరోనా పాజిటివ్‌ తేలడం, తాజాగా మరో ముగ్గురు కరోనా బారిన డటం ఇప్పుడు బీసీసీఐలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ముంబైలో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కేసుల్లో మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ విధిస్తోంది.

కాగా, మార్చి 26న గ్రౌండ్స్‌మెన్‌కి కరోనా పరీక్షలు నిర్వహించగా, ముందుగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 1న నిర్వహించిన పరీక్షల్లో మరో ఐదుగురు ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇక తాజాగా మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ తేలింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముంబాయి క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పుడు పునరాలోచనలో పడిపోయింది. ఇంకెంత మందికి వైరస్‌ సోకుతుందేమోనన్న ఆందోళనలో ఉంది.

ఇవీ చదవండి: Mahendra Singh Dhoni: ఐపీఎల్‌లో ధోనికి మాత్రమే సొంతమైన రికార్డులు.. ఈసారి సాధించనున్న మూడు ఘనతలు ఇవే..

Tokyo Olympics: దక్షిణ కొరియా, జపాన్‌లకు ఉ.కొరియా షాక్…టోక్యో ఒలంపిక్స్‌కు దూరం..