IPL 2021: ముంబై ఇండియన్స్ ‘క్యూటెస్ట్’ వైరల్ వీడియో.. తండ్రిని మించిన తనయ.. పుల్ షాట్ ఆడి దించేసిందిగా..

|

Mar 31, 2021 | 3:21 PM

Rohit Sharma Daughter: ముంబై ఇండియన్స్ టీమ్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ కూతురు సమైరా హెల్మెట్ పెట్టుకుని సందడి చేసిన వీడియోను..

IPL 2021: ముంబై ఇండియన్స్ క్యూటెస్ట్ వైరల్ వీడియో.. తండ్రిని మించిన తనయ.. పుల్ షాట్ ఆడి దించేసిందిగా..
Rohit Sharma Daughter
Follow us on

Mini Pull-Shot: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు మరోసారి టైటిల్ హాట్ ఫేవరెట్‌గా రంగంలోకి దిగుతోంది. తన ఫ్యామిలీతో కలిసి రోహిత్ ముంబై జట్టుతో కలిశాడు. ముంబై ఇండియన్స్ టీమ్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ కూతురు సమైరా హెల్మెట్ పెట్టుకుని సందడి చేసిన వీడియోను ఫ్యాన్‌తో షేర్ చేసుకుంది. ‘మినీ పుల్ షాట్ ఆడిన చిన్నారి.

ముంబై ఇండియన్స్ ‘క్యూటెస్ట్’ సపోటర్. ఐపీఎల్ 2021 ప్లాన్ సిద్ధంగా ఉంది’ అని వీడియోతోపాటు ఓ ట్యాగ్ లైన్‌ను ట్వీట్ చేసింది. వీడియోలో తన తండ్రి బ్యాటింగ్ శైలిని చేసి చూపించింది సమైరా.. ఇంగ్లాండ్- టీమిండియా మధ్య జరిగిన వన్డేలో పుల్ షాట్ ఎలా కొట్టాడో కూడా చూపించింది.

డాడీ పుల్ షాట్ ఎలా కొడతారని రోహిత్ శర్మ భార్య రితిక అడగ్గా.. సమైరా ఆడి చూపించింది. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ క్యూట్ వీడియోను వైర‌లైంది. అభిమానులు లైకులు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

From a mini pull-shot ? to an MI cheer chant ➡️ Sammy’s #IPL2021 plan is ready ✅#OneFamily #MumbaiIndians @ImRo45 @ritssajdeh pic.twitter.com/vPnTCjLVLc

ఏప్రిల్ 9 నుంచి జరిగే IPL 2021కు సందడి షురూ అయింది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశిస్తున్నారు. చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడబోతున్నాయి.

ఇవి కూడా చదవండి : ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

ఇవి కూడా చదవండి : Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!