IPL 2021 MI vs CSK: రోహిత్ శర్మ వర్సెస్ సురేష్ రైనా.. ఓ రికార్డు కోసం ఇరువురి పోరాటం.. తొలుత సాధించేదెవరో?

|

Sep 19, 2021 | 3:20 PM

IPL 2021: ఐపీఎల్ 2021 రెండవ దశ చెన్నై వర్సెస్ ముంబై (CSK vs MI) మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో పోటీ మాత్రం రోహిత్ శర్మ వర్సెస్ సురేష్ రైనాల మధ్యే ఉండనుంది.

IPL 2021 MI vs CSK: రోహిత్ శర్మ వర్సెస్ సురేష్ రైనా.. ఓ రికార్డు కోసం ఇరువురి పోరాటం.. తొలుత సాధించేదెవరో?
Ipl 2021 Mi Vs Csk Rohit Sharma Vs Suresh Raina
Follow us on

IPL 2021 CSK vs MI: ఐపీఎల్ 2021 రెండవ దశకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. దుబాయ్‌లో ఈ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో రెండూ బలమైన, అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య యుద్ధం చాలా తీవ్రంగా ఉండబోతుందనే వాస్తవం. కానీ, ఈ యుద్ధంలో అందరి చూపు రోహిత్ శర్మ వర్సెస్ సురేష్ రైనాల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖాముఖి పోరాటాల్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌దే ఆధిపత్యంగా నిలిచింది.

ఐపీఎల్ 2021 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సురేశ్ రైనా ప్రస్తుతం మూడవ స్థానంలో నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈరోజు మ్యాచ్‌లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మన్‌ల మధ్య మొదట ఐదున్నర వేల పరుగులు పూర్తి చేయడానికి పోటీ నెలకొని ఉంది. విరిద్దరూ ఈ ఘనత సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నారు.

రోహిత్ వర్సెస్ రైనా..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 207 మ్యాచ్‌ల్లో 31.49 సగటుతో 5480 పరుగులు చేశాడు. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా 200 మ్యాచ్‌ల్లో 33.07 సగటుతో 5491 పరుగులు చేశాడు. అంటే, రైనా 5న్నర వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 9 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మకు 20 పరుగులు అవసరం కానుంది. రైనా లక్ష్యం దగ్గరగా ఉందని స్పష్టమవుతోంది. కానీ, మొదటి ఐదున్నర వేల పరుగులు పూర్తి చేయాలంటే మాత్రం.. టాస్‌దే కీలకం కానుంది.

మూడవ భారతీయుడిగా..
ఈ ఇద్దరిలో నేడు 5000 పరుగులు పూర్తి చేసిన వారు ఐపీఎల్‌లో అలా చేసిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నారు. అంతకుముందు, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఈ రికార్డును చేరుకున్నారు. విరాట్ 199 ఐపీఎల్ మ్యాచ్‌లలో 6076 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 184 మ్యాచ్‌ల్లో 5577 పరుగులు పూర్తి చేశాడు.

ఐపీఎల్ 2021 మొదటి దశ గణాంకాలను పరిశీలిస్తే, రైనా కంటే రోహిత్ రిపోర్ట్ కార్డ్ మెరుగ్గా కనిపిస్తుంది. మొదటి దశలో 7 మ్యాచ్‌ల్లో రోహిత్ 250 పరుగులు చేశాడు. అదే సమయంలో, రైనా 7 మ్యాచ్‌లలో 123 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021 రెండో దశలో ఈ ఇద్దరు ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేసినట్లు తెలుస్తుంది.

Also Read: IPL 2021 MI vs CSK: ఐపీఎల్ సందడి షురూ.. తొలిరోజు రోహిత్‌తో తలపడనున్న ధోని.. బలాలు, బలహీనతలు ప్రివ్యూలో చూద్దాం!

IPL 2021: ధోని 8 సిక్సర్లు కొట్టి ముంబైని హెచ్చరించాడు..! వీడియో చూస్తే అదిరిపోతారంతే..?

IPL 2021: షార్జాలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి నో ఎంట్రీ.. RT-PCR టెస్ట్‌ రిజల్ట్ కచ్చితం..