Rohit Sharma: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. నెక్స్ట్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడి గెలిచింది. హిట్ మ్యాన్ రోహిత్ సారధ్యంలో లీగ్ లో శుభారంభం చేసింది, ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ను పక్కన పెట్టి.. బౌల్ ను చేతపట్టుకున్నాడు.
సర్వసాధారణంగా ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ ఎప్పడూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. అయితే ఈ సారి కొత్తగా స్పిన్ బౌలింగ్ ని ప్రాక్టీస్ చేశాడు. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో ఓటమికి బౌలింగ్ కారణం అని కూడా భావిస్తున్న జట్టుకి అదనపు ప్రయోజనం కలిగించడానికి .. ముఖ్యంగా చెన్నై పిచ్ ఎక్కువగా స్పిన్‌కు సహకరిస్తుండటంతో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా రోహిత్ అవసరమైనప్పుడు బౌలింగ్‌చేయడానికి సిద్ధమయ్యాడు. మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. డెత్ ఓవర్లలో ముంబై కళ్లు చెదిరే బౌలింగ్‌తో అదరగొట్టింది.
అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేస్తున్న వీడియో ఫ్రాంఛైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇక ముంబై జట్టులో కొత్తగా చేరిన వారు త్వరగా జట్టులో కలిసిపోవాలని రోహిత్ శర్మ కోరుకున్నాడు. ఎందుకంటే క్రికెట్ టీమ్ గా రాణించడం ఎంతో ముఖ్యమని చెప్పాడు. తమ జట్టు మంచి ప్రదర్శన చేసి. అభిమానులను అలరిస్తామని తెలిపాడు.
Also Read: శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత.. వీటి రెసిపీ ఏమిటంటే..!
పవన్ కళ్యాణ్ పిల్లలతో అడవి శేషు.. లైవ్‌లో రిలేషన్ పై స్పందించిన రేణు దేశాయ్