IPL 2021: బ్యాటింగ్, బౌలింగ్‌ ప్రధాన బలం.. మిగతా జట్లకు అదే ప్రమాదం..!

|

Apr 03, 2021 | 9:57 PM

IPL 2021: ఐపీఎల్ ప్రారంభం నాటి నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంటూ వస్తోంది. మొదట్లో ఆశించినంతగా రాణించకపోయినా..

IPL 2021: బ్యాటింగ్, బౌలింగ్‌ ప్రధాన బలం.. మిగతా జట్లకు అదే ప్రమాదం..!
Kolkata Knight Riders
Follow us on

IPL 2021: ఐపీఎల్ ప్రారంభం నాటి నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంటూ వస్తోంది. మొదట్లో ఆశించినంతగా రాణించకపోయినా.. ఆ తర్వాత 2012లో గౌతమ్ గంభీర్ కెప్టెన్ అయినప్పటి నుంచి దశ తిరిగింది. గంభీర్ కెప్టెన్సీలో జట్టు తొలి టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత మళ్లీ 2014లో కూడా గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకునిపోయింది. ఇక మళ్లీ ఇప్పుడు మరో టైటిల్ వేటలో సర్వ సిద్దమవుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ నాయకత్వంలో కేకేఅర్ జట్టు ఐపీఎల్ 14వ సీజన్ బరిలోకి దిగుతోంది.

కోల్‌కతా జట్టును పరిశీలిస్తే, బలమైన జట్టుగా ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. బలమైన బ్యాటింగ్‌తో పాటు పదునైన బౌలింగ్ కేకేఅర్ సొంతం. యువ బ్యాట్స్‌మన్ శుభ్ మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, మోర్గాన్, దినేష్ కార్తీక్, టిమ్ సీఫెర్ట్ వంటి బ్యాట్స్ మెన్ ఏ సందర్భంలోనైనా స్కోరు చేయగలరు. జట్టుకు ఆల్ రౌండర్ల కొరత కూడా లేదు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగలిగే సామర్థ్యం ఉన్న బెన్ కట్టింగ్, షకీబ్ అల్ హసన్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ వంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. అదే సమయంలో, ఆండ్రీ రసైల్ వంటి ఆల్ రౌండర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. వీరందరూ కూడా కేకేఅర్‌కు విజయాలు తెచ్చిపెట్టగలరు.

బౌలింగ్‌లో అనుభవం…

బౌలింగ్ కూడా బలంగా ఉంది. కోల్‌కతాకు పాట్ కమ్మిన్స్, శివమ్ మావి, కమలేష్ నాగర్కోటి, ప్రసిద్ధ కృష్ణ వంటి మేటి బౌలర్లు ఉన్నారు. స్పిన్ విభాగంలో, నరేన్ వంటి అద్భుత బౌలర్. అలాగే గత సీజన్‌లో ప్రభావితం చూపిన వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నారు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ స్పిన్ కూడా జట్టుకు ఉపయోగపడుతుంది. ఈ సీజన్‌లో జట్టుకు హర్భజన్ సింగ్ అనుభవం కూడా ఉంటుంది.

కేకేఅర్ జట్టు –

అయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్, కరుణ్ నాయర్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, రింకు సింగ్, శుబ్మాన్ గిల్, హర్భజన్ సింగ్, కమలేష్ నాగెర్కోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, పాట్ కమ్మిన్స్, పవన్ నేగి, సాండెప్ వార్షి, శివం మావి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసైల్, బెన్ కట్టింగ్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరేన్, వెంకటేష్ అయ్యర్, షెల్డన్ జాక్సన్, టిమ్ సీఫెర్ట్.