IPL 2021: తొలి రెండు మ్యాచుల్లో బౌండరీల భీభత్సం.. కోహ్లీ, రోహిత్‌లకు చుక్కలు.. 26న ధోని టీంకు దబిడ దిబిడే అంటోన్న గంగూలీ శిష్యుడు

|

Sep 24, 2021 | 2:49 PM

తన మొదటి మ్యాచ్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆడి, రెండో మ్యాచ్ కాబోయే కెప్టెన్‌ రోహిత్ శర్మతో తలపడ్డాడు. ఇక మూడో మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వ్యతిరేకంగా ఆడబోతున్నాడు.

IPL 2021: తొలి రెండు మ్యాచుల్లో బౌండరీల భీభత్సం.. కోహ్లీ, రోహిత్‌లకు చుక్కలు.. 26న ధోని టీంకు దబిడ దిబిడే అంటోన్న గంగూలీ శిష్యుడు
Venkatesh Iyer
Follow us on

Venkatesh Iyer: ఐపీఎల్‌లో మొదటి 2 మ్యాచ్‌లు టీమిండియా క్రికెట్ సూపర్‌స్టార్‌లతో ఆడాడు. ఇక మూడో మ్యాచులో మాజీ స్టార్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఆయనెవరో కాదు టీ 20 క్రికెట్‌లో గత రెండు మ్యాచుల్లో స్టార్‌ బౌలర్లకు కూడా చుక్కలు చూపించిన భారత యువ తేజం వెంకటేష్ అయ్యర్. ప్రస్తుతం ఐపీఎల్‌లో అయ్యర్ పేరు మారుమ్రోగిపోతోంది. తన దూకుడైన బ్యాటింగ్‌తో బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ యువతేజం దెబ్బకు కీలక జట్లే మట్టికరిచాయి. వెంకటేష్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లో టీమిండియా టీ 20 కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆడి.. బోల్తా కొట్టించాడు. అలాగే టీ 20 టీంకు కాబోయే కెప్టెన్ రోహిత్ శర్మతో రెండో మ్యాచ్ ఆడి, ఘోర పరాజయం చవిచూపించాడు. ఇక మూడో మ్యాచులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వ్యతిరేకంగా ఆడబోతున్నాడు. ఈ సీజన్‌లో తన మొదటి రెండు మ్యాచ్‌లలో భయాందోళనలు సృష్టించి, ఐపీఎల్ 2021 లో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచిన వెంకటేష్ అయ్యర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో కీలకకంగా మారాడు. రజనీకాంత్ సౌత్ సినిమాలపై ఆధిపత్యం వహించినట్లే.. ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో రజనీకి పెద్ద అభిమాని అయిన వెంకటేష్ అయ్యర్ కూడా కీలకమైన జట్లపై ఆధిపత్యం చూపిస్తున్నాడు.

ఐపీఎల్ అరంగేట్రంతోనే విరాట్‌కు చుక్కలు చూపించాడు..
టీమిండియా ప్రస్తుత టీ 20 కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఐపీఎల్ టీం అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వెంకటేష్ అయ్యర్ తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ముందు ఆర్‌సీబీ 93 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్ కేవలం 27 బంతుల్లో అజేయంగా 41 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. వెంకటేష్ అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ టీం 10 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

రోహిత్‌ను మట్టి కరిపించాడు..
మొదట విరాట్‌కు చుక్కలు చూపించిన వెంకటేష్ అయ్యర్.. రెండో మ్యాచులో రోహిత్‌ను మట్టికరిపించాడు.
టీమిండియా టీ 20 టీంకు కాబోయే కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ వెంకటేశ్ తన రెండవ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మరోసారి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ ముందు విజయం కోసం ముంబై ఇండియన్స్ 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వెంకటేశ్ అయ్యర్‌ రోహిత్ అండ్ కోపై 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఈసారి వెంకటేశ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి కోల్‌కతా టీం 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, ప్లే ఆఫ్ రేసులోకి ఎంటరైంది.

సెప్టెంబర్ 26న ధోనీతో పోరుకు రెడీ..
కేకేఆర్ తన తదుపరి మ్యాచ్‌ని మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. ఇది ఐపీఎల్‌లో వెంకటేష్ అయ్యర్‌కు మూడో మ్యాచ్ కానుంది. ధోనీ వ్యూహాలను అణిచివేసేందుకు వెంకటేష్ అయ్యర్ సిద్ధమయ్యాడు. విరాట్, రోహిత్ బృందాలను కలిపి 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు కొల్లగొట్టిన ఈ కొత్త కేకేఆర్ ప్లేయర్‌ ధాటికి ధోని ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తాడో చూడాలి.

నా జీవితంలో ఆయనో పెద్ద మార్పు తెచ్చాడు.. అందుకే లెఫ్ట్ హ్యాండర్‌గా మారాను
“నేను చిన్నతనంలో కుడి చేతితో బ్యాటింగ్ చేసేవాడిని. కానీ, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి వీరాభిమానిని. ఆయన ఎలా సిక్సర్లు కొట్టాడో.. అలాగే నేను బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాను. దాదా నా జీవితంలో తెలియకుండానే చాలా పెద్ద పాత్ర పోషించాడు. నేను నిజంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను” అని తన మనసులో మాటను వెల్లడించాడు. గంగూలీ కోసమే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా మారాలని కోరుకున్నాను.

Also Read: కోహ్లీ సహచరుడు లైన్ వేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు!

Virat Kohli: జిమ్‌లో విరాట్ కోహ్లీ తీవ్ర కసరత్తులు.. వీడియోకు 10 గం.ల్లో 20 లక్షల లైక్స్..