IPL 2021 Final, CSK vs KKR: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఏడాదికి పైగా అయింది. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయినప్పటికీ ధోనీ రికార్డ్‌లను ప్రభావితం చేయలేదు. ఈ రోజు కూడా ధోనీ మైదానంలో అడుగుపెట్టినప్పుడు ఒక ప్రత్యేకతను సాధించనున్నాడు. 9 వ సారి చెన్నై సూపర్ కింగ్స్‌ని ఫైనల్‌కి తీసుకెళ్లిన ధోనీ, ఈ శుక్రవారం కెప్టెన్‌గా మైదానంలోకి ప్రవేశించిన వెంటనే భారీ రికార్డు సృష్టించనున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన గత సీజన్‌లో నిరాశపరిచింది. ఈ సీజన్‌లో జట్టు అద్భుతంగా పుంజుకుంది. వారు ప్లేఆఫ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచారు. ఆ తర్వాత ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగాను నిలిచారు. శుక్రవారం, జట్టు నాల్గవ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. చెన్నై పేరులో టైటిల్ ఉందో లేదో కానీ ధోనీ పేరుతో మాత్రం ‘ట్రిపుల్ సెంచరీ’ ఖాయంగా ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీ ట్రిపుల్ సెంచరీ..
మహేంద్ర సింగ్ ధోని శుక్రవారం 300 వ సారి టీ20 కెప్టెన్‌గా ఫీల్డ్‌లోకి వెళ్లనున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ధోనీ 299 వ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ధోని విజయం శాతం 59.79గా ఉంది. 2017 లో టీమిండియా టీ 20 కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. 2007 లో టీ 20 ఇండియాకు టీ 20 వరల్డ్ కప్ అందుకోవడం నుంచి 2017 సంవత్సరంలో 72 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఈ 72 మ్యాచుల్లో టీమిండియా 41 మ్యాచుల్లో గెలిచింది. 28 మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లలో ఒకటి టై అయింది. రెండు మ్యాచ్‌ల్లో రిజల్ట్ మాత్రం రాలేదు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కొరకు 213 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 130 మ్యాచ్‌లు గెలిచి, 81 మ్యాచ్‌లో ఓడిపోయాడు. 2016 సంవత్సరంలో ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. జట్టు అతని కెప్టెన్సీలో 14 మ్యాచ్‌లలో ఆడి 5 గెలిచి, 9 మ్యాచుల్లో ఓడింది.
పోటీలో ఎవ్వరూ లేరు..
200 కంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లలో అన్ని లీగ్‌లకు నాయకత్వం వహించిన డారెన్ సామి తర్వాత ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌ని రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా చేసిన సామీ 208 టీ 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ తర్వాత, అత్యధిక టీ 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్‌గా నిలిచాడు.
Also Read: IPL 2021 Final: ధోనీ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన గౌతమ్ గంభీర్.. ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించలే..!