IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి నిషేధం ముప్పు.! అసలు కారణమిదే.?

Mahendra Singh Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. రెండు నుంచి నాలుగు మ్యాచ్‌లు బ్యాన్...

IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి నిషేధం ముప్పు.! అసలు కారణమిదే.?
Ms Dhoni

Updated on: Apr 16, 2021 | 3:57 PM

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. రెండు నుంచి నాలుగు మ్యాచ్‌లు బ్యాన్ ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోని మ్యాచ్ ఫీజులో రూ. 12 లక్షల కోత పడిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్‌కు సంబంధించిన ఎనిమిది ఫ్రాంచైజీలకు బీసీసీఐ పలు కఠినమైన నిబంధనలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ నిబంధనల ప్రకారం… 20 ఓవర్లు(ఒక ఇన్నింగ్స్) ఖచ్చితంగా గంటన్నరలోగా పూర్తి చేయాలని తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఈ రూల్‌ను అతిక్రమిస్తే.. మొదటి తప్పుగా రూ.12 లక్షల జరిమానా విధిస్తుంది. ఒకవేళ ఇది రిపీట్ అయితే మాత్రం ‘మినిమమ్ ఓవర్ రేట్స్’ పెనాల్టీ కింద రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోని ఓవర్ రేట్‌ను తీక్షణంగా పరిశీలించాలి. లేదంటే రెండు లేదా నాలుగు మ్యాచ్‌ల బ్యాన్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

Loading...
Unable to load recommendations.
Follow Us