Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే.. ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : భారత క్రికెటర్ల ఆహారపు అలవాట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ధోనీ, హార్దిక్ పాండ్యా మాంసాహారం ఇష్టపడితే, విరాట్ కోహ్లీ మాత్రం శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడంతో డాక్టర్ల సలహా మేరకు ఆరోగ్యం కోసం వీగన్ డైట్‌కు మారిపోయారు. ఆ వివరాలు మీకోసం.

Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే..  ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?
Indian Cricketers Diet

Updated on: Apr 06, 2026 | 9:21 AM

Indian Cricketers Diet : మైదానంలో మెరుపు వేగంతో కదిలే క్రికెటర్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. సిక్సర్ల మోత మోగించాలన్నా, గంటల తరబడి ఫీల్డింగ్ చేయాలన్నా వారు తీసుకునే ఆహారం చాలా కీలకం. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం శాకాహారం, మాంసాహారం రెండూ అందుబాటులో ఉంటాయి. అయితే మన స్టార్ క్రికెటర్లలో ఎవరు ఏం తింటారు? ధోనీ ఫేవరెట్ డిష్ ఏంటి? కోహ్లీ డైట్ ఎందుకు మార్చాడు? అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎంఎస్ ధోనీ

భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భోజనం అంటే చాలా ఇష్టం. ఆయన పక్కా మాంసాహారి. ధోనీకి బటర్ చికెన్, మటన్ కర్రీ అంటే పంచప్రాణాలు. రాంచీ వెళ్ళినప్పుడు ఇంట్లో వండిన దేశీ చికెన్‌ను అమితంగా ఇష్టపడతారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ధోనీ తన డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన ఆహారంలో పండ్లు, తాజా జ్యూస్‌ల పరిమాణాన్ని పెంచారు. ఫిట్‌నెస్ కోసం అనవసరమైన కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు.

విరాట్ కోహ్లీ

ఒకప్పుడు చికెన్ లెగ్ పీస్ లేనిదే ముద్ద దిగని కోహ్లీ, ఇప్పుడు పక్కా వీగన్ (జంతు సంబంధిత ఆహారం తీసుకోని వారు). 2018లో సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు కోహ్లీకి వెన్నెముక సమస్య తలెత్తింది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడంతో డాక్టర్ల సలహా మేరకు మాంసాహారం, పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులను పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి ఆయన కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఈ మార్పు తర్వాత తన ఫిట్‌నెస్ మరింత మెరుగుపడిందని కోహ్లీ స్వయంగా వెల్లడించారు.

శుభ్‌మన్ గిల్

టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ తన లీన్ బాడీని కాపాడుకోవడానికి మాంసాహారాన్ని నమ్ముకున్నారు. గిల్ ఎక్కువగా జపనీస్ వంటకాలను ఇష్టపడతారు, అందులోనూ సుషీ అంటే ఆయనకు క్రేజ్. దీనితో పాటు గ్రిల్డ్ చికెన్‌ను రెగ్యులర్ డైట్‌లో భాగంగా చేసుకున్నారు. మైదానంలో నిరంతరం శక్తివంతంగా ఉండటానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మధ్య సరైన సమతుల్యతను గిల్ పాటిస్తారు.

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ కాబట్టి ఆయనకు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ విపరీతమైన ఎనర్జీ కావాలి. అందుకే ఆయన కఠినమైన నాన్-వెజ్ డైట్‌ను అనుసరిస్తారు. చికెన్, చేపలు, ఉడకబెట్టిన గుడ్లు ఆయన భోజనంలో ప్రధానంగా ఉంటాయి. జిమ్‌లో కష్టపడే హార్దిక్, తన కండరాల పుష్టి కోసం లీన్ మీట్‌ను ఎక్కువగా తీసుకుంటారు. పాండ్యా తన ఆహారంలో నూనె, మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్త పడతారు.

రిషబ్ పంత్

విస్ఫోటక బ్యాటర్ రిషబ్ పంత్‌కు సీఫుడ్, చికెన్ అంటే చాలా ఇష్టం. అయితే కారు ప్రమాదం తర్వాత కోలుకుంటున్న సమయంలో పంత్ తన ఆహారంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. బరువు తగ్గడంతో పాటు చురుకుదనం పెంచుకోవడానికి ఇప్పుడు ఆయన తాజా కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే మాంసాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్ తిరిగి సాధించడంలో డైట్ తనకు ఎంతో తోడ్పడిందని పంత్ చెబుతుంటారు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us