India Women vs Bangladesh Women: మహిళల క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. రెండో టీ20ఐలోనూ టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. టీమిండియా 8 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 96 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయింది.
తక్కువ స్కోరు చేసిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించారు. టీమిండియా తరపున దీప్తి శర్మ 3 వికెట్లు, మిన్ను మణి 2 వికెట్లు తీశారు. చివరి ఓవర్లో షెఫాలీ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. మరో వికెట్ స్టంప్ రూపంలో వచ్చింది.
🔥 THRILLER IN MIRPUR! The girls defended their lowest-ever total in style to secure the T20I series victory against Bangladesh!
💪🏻 Let’s go for a clean sweep, girls!
📷 Getty • #INDvBAN #BANvIND #BANWvINDW #TeamIndia #BharatArmy pic.twitter.com/hty2jwIZpI
— The Bharat Army (@thebharatarmy) July 11, 2023
దీంతో చివరి ఓవర్లో బంగ్లాకు 10 పరుగులు రావాల్సిన చోట 4 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..