INDW vs AUSW: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఉమెన్స్ ప్రకటన.. ముగ్గురు కొత్త ముఖాలకు అవకాశం.. వీరికి మాత్రం నో ఛాన్స్!

|

Aug 25, 2021 | 7:05 PM

భారత జట్టు ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో టెస్ట్, వన్డే, టీ 20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

INDW vs AUSW: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఉమెన్స్ ప్రకటన.. ముగ్గురు కొత్త ముఖాలకు అవకాశం.. వీరికి మాత్రం నో ఛాన్స్!
Teamindia Womens Team
Follow us on

IND vs AUS: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ పర్యటన కోసం భారత జట్టును నేడు ప్రకటించారు. మిథాలీ రాజ్ టెస్ట్, వన్డే సిరీస్ కోసం సారథ్యం వహించనుండగా, టీ 20 లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జట్టులో కొంతమంది కొత్త ముఖాలకు కూడా జట్టులో చోటిచ్చారు. మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, యస్తికా భాటియా మొదటిసారిగా టీమిండియా తరపున అరంగేట్రం చేశారు. కాగా, బ్యాట్స్‌మెన్ ప్రియా పూనియా జట్టుకు దూరమయ్యారు. పూనియా ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్, వన్డే జట్టులో ఆడడం గమనార్హం.

సీనియర్ బ్యాట్స్‌మెన్ వేదా కృష్ణమూర్తి కూడా ఈ పర్యటనకు ఎంపిక కాలేదు. ఆమె ఇంగ్లండ్‌కు కూడా వెళ్లలేదు. ఆమె గత కొంత కాలంగా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆమె తల్లి, అక్క కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. టెస్ట్ జట్టు గురించి మాట్లాడితే.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన యువ వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాలేదు. దీంతో పాటు, రాధా యాదవ్ కూడా టెస్ట్, వన్డే జట్టుకు దూరంగా ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఈ రెండు ఫార్మాట్లలో ఆమె టీమిండియా తరపున ఆడింది. ఇక టీ20 జట్టును చూస్తే, సిమ్రాన్ దిల్ బహదూర్, ఇంద్రాణి రాయ్ కూడా ఎంపిక కాలేదు. వీరిద్దరూ ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఆడలేదు.

సెప్టెంబర్ 19 నుంచి సిరీస్ ప్రారంభం..
సెప్టెంబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. తొలుత వన్డే సిరీస్‌లో తలపడనున్నారు. సెప్టెంబర్ 19న మొదటి వన్డే ఆడతారు. అనంతరం సెప్టెంబర్ 30 న ఏకైక టెస్ట్ ఆడనున్నారు. పింక్ బాల్‌తో జరిగే ఈ డే-నైట్ లో ఇరు జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 7 నుంచి రెండు జట్లు టీ 20 ఫార్మాట్‌లో తలపడనున్నాయి.

భారత మహిళా క్రికెట్ జట్టు..
టెస్టు, వన్డేల కోసం..
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధన, షెఫాలీ వర్మ, పూనమ్ రౌత్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, యస్తికా భాటియా, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, జులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రిచా ఘోష్ మరియు ఏక్తా బిష్త్.

టీ20 కోసం..
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్-కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, యస్తికా భాటియా, శిఖా పాండే, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ మరియు రేణుకా సింగ్ ఠాకూర్.

Also Read: Kohli vs Root: లార్డ్స్ లాంగ్‌రూమ్‌లో కోహ్లీ, రూట్‌ వాగ్వాదం.. తోడైన టీం ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే..?

SportsPro 50mm Athletes: టాప్ 50లో విరాట్ కోహ్లీ మిస్.. మెస్సీ, ఫెదరర్‌లను అధిగమించిన హార్దిక్ పాండ్యా.. ఎన్నో స్థానంలో నిలిచాడంటే..?