U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‎లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే

U19 World Cup 2026 : తొలి మ్యాచ్‌లోనే అమెరికాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో తమ సత్తా చాటారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్‌లో 125 సెంచరీలు బాదిన రికార్డు ఉన్న అభిజ్ఞాన్ కుందు, బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన హెనిల్ పటేల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‎లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే
Abhigyan Kundu Double Century

Updated on: Jan 16, 2026 | 1:17 PM

U19 World Cup 2026 : జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే అమెరికాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో తమ సత్తా చాటారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్‌లో 125 సెంచరీలు బాదిన రికార్డు ఉన్న అభిజ్ఞాన్ కుందు, బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన హెనిల్ పటేల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ హెనిల్ పటేల్ తన స్పెల్‌తో అమెరికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అమెరికా వెన్ను విరిచాడు. దీంతో అమెరికా జట్టు 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది.

భారత్ ఛేజింగ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్దేశించారు. లక్ష్యం చిన్నదే అయినా భారత టాపార్డర్ తడబడటం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ (2), కెప్టెన్ ఆయుష్ మాత్రే (19), వేదాంత్ త్రివేది (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. భారత్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. జూనియర్ క్రికెట్‌లో ఇప్పటికే 125 సెంచరీలు బాదిన రికార్డు ఉన్న కుందు.. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విహాన్ మల్హోత్రా (18)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరికి 41 బంతుల్లో 42 పరుగులు చేసిన కుందు.. ఒక అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..