IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. సంజయ్ మంజ్రేకర్ గిల్ కెప్టెన్సీని కోహ్లీతో పోల్చారు. టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ నిరాశపరిచింది. కోహ్లీ ఉంటే విజయం సాధించేవారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Gill Vs Kohli

Updated on: Jun 25, 2025 | 7:01 AM

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. టెండూల్కర్‌ అండర్సన్‌ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ అద్భుతంగా చేసినట్లు అనిపించినా.. అది విజయానికి సరిపోలేదు. దాంతో పాటు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలింగ్‌ లేలిపోయిందనే చెప్పాలి. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌కు ఇది మొట్టమొదటి టెస్ట్‌ కావడంతో అందరి చూపు అతనిపైనే ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను విరాట్‌ కోహ్లీతో కంప్యార్‌ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదో రోజు ఆటలో గిల్‌ మరీ ఎక్కువ డిఫెన్సీవ్‌ కెప్టెన్సీ చేశాడని, బౌండరీలు ఆపేందుకు చూశాడు తప్పితే.. ఎటాకింగ్‌ ఫీల్డ్‌ సెట్‌ చేయలేదని విమర్శించాడు.

ఇదే విషయంలో కోహ్లీతో కంప్యార్‌ చేస్తూ.. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌ ఆడిన గిల్‌ను, కోహ్లీ కంప్యార్‌ చేయడం సరికాదు అంటూనే.. ఇదే టెస్ట్‌లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే.. డిఫెండ్‌ చేసుకోవడానికి తన వద్ద సరిపడా రన్స్‌ ఉన్నాయని, ఎటాకింగ్‌ ఫీల్డ్‌ పెట్టి.. ఇంగ్లాండ్‌ టీ బ్రేక్‌ లోపు ఆలౌట్‌ చేస్తాననే చెప్పేవాడని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవలె విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అతను రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత జరిగిన తొలి టెస్ట్‌ కావడంతో మంజ్రేకర్‌తో పాటు చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఈ ఓటమి తర్వాత కోహ్లీని గుర్తు చేసుకుంటున్నారు. కోహ్లీ ఉండుంటే బాగుండేదని. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌ సెంచరీలో రాణించారు.

ఇక ఇంగ్లాండ్‌ సైతం తొలి ఇన్నింగ్స్‌ గట్టి జవాబు ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓలీ పోప్‌ సెంచరీ సాధించాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5, సిరాజ్‌ 2. ప్రసిద్ధ్‌ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా మంచి స్కోర్‌ సాధించింది. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ సెంచరీలు సాధించడంతో 364 పరుగుల స్కోర్‌ చేసింది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు 371 పరుగుల భారీ టార్గెట్‌ ఉంచింది. ఈ టోటల్‌ను టీమిండియా కాపడుకుంటుందేమో అనిపించినా.. అది జరగలేదు. ఇంగ్లాండ్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చాలా ఈజీగా టార్గెట్‌ ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌ బెన్‌ డకెట్‌ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. దాంతో పాటు ఓపెనర్‌ జాక్‌ క్రాలే, జో రూట్‌, స్మిత్‌ మంచి బ్యాటింగ్‌ చేసి.. విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి